హుజురాబాద్‌లో ద‌ళిత బంధు కోసం రూ. 500 కోట్లు విడుద‌ల‌

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. ద‌ళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎన్నెన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. తాజాగా ద‌ళితుల‌ను వ్యాపారులుగా మార్చేందుకు ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెడుతున్నారు ముఖ్య‌మంత్రి. ఈ క్ర‌మంలో హుజురాబాద్‌ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత బంధు అమ‌లుకు రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఈ ప‌థ‌కం అమ‌లు కోసం రూ. 500 కోట్లు విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పైల‌ట్ ప్రాజెక్టుగా తెలంగాణ ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లు కానుంది. ఈ నెల 16వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని హుజురాబాద్ వేదిక‌గా ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న వాసాల‌మ‌ర్రి ద‌ళితుల కోసం ఈ ప‌థ‌కం కింద రూ. 7.60 కోట్లు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *