దళిత బంధు పేరుతో కేసిఆర్ మరో దగా

అక్షిత ప్రతినిధి, పర్వతగిరి: టి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేబుతున్న దళితబంధు పథకం ఒక్క బూటకం అని యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్ మరియు యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము రమేష్ అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గన్నికి వందమందికి లబ్దిదారులకు ఒక్కరి చోప్పున పదిలక్షల రూపాయలు ఇస్తాన్నన కె.సి.ఆర్,ఇంతకుముందు దళితులకు ఇచ్చిన హమీలు ఎక్కడ వేసిన గొంగడిల అక్కడ ఉన్నాయి.దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హమీలు ఇచ్చి ,ఇప్పుడు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను గుంజుకున్న దళిత ద్రోహి ఈ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కదా అన్ని పశ్నించారు. రెండు దఫాలుగా ఆధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం దళితులను పట్టించుకోకుండా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ.ఎస్టీ సాబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్ళించి దళితులకు తీరని అన్యాయం చేసారని,గత ఆరేడు సంవత్సరాల నుండి నిరుద్యోగులకు కనీసం ఒక్క లక్ష రూపాయల లోను కూడా ఇవ్వకుండా కెసిఆర్ ఈరోజు నియోజకవర్గంలో ఒక్క ఒక్కరికి పదిలక్షల రూపాయలు పథకం అనే కోత్త నాటకం తెరతీసాడన్ని అన్నారు. దళిత విధ్యార్థులకు కనీసం మెస్ చార్జీలు, ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వని కెసిఆర్ కొత్త పథకం ద్వారా పదిలక్షల రూపాయల ఋణం ఇస్తాడని ఎలా నమ్మమంటారో తెలుపాలన్ని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం లో ఆధిక జనభా కలిగిన దళిత వర్గాలు తెరాస పార్టీకి దూరం అవుతున్నారని గమనించి రానున్న రోజుల్లో తెరాస పుట్టగతులు ఉండయనేభయంతోనే దళిత బందు పథకం ముసుగు తొడిగారన్నిఅన్నారు.తెలంగాణా చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ దళిత ద్రోహిగానే చరిత్ర పుటల్లో స్థానం ఏర్పరచుకున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు శంకర్ నాయక్, ఉడుతల కృష్ణ, నీరటి ప్రశాంత్, భూక్యా సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *