దళిత బందుతో దగా

అక్షిత న్యూస్, పర్వతగిరి : దళిత బందు పేరుతో దళితులను కెసిఆర్ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే దళిత నాయకుడు ముఖ్యమంత్రి చేస్తా అన్న కెసిఆర్ స్వయంగా ముఖ్యమంత్రి గద్దెనెక్కడం దళితులను మోసం చేసినట్టు కాదా అని, రైతుబంధుతో రైతులను దగా చేస్తున్న కెసిఆర్ రైతుబంధు ఆశచూపి ఒక్కొక్క రైతుకు సుమారుగా 5 నుండి 20 గుండాల వరకు నష్ట పోయారని అన్నారు. రైతు పండించిన పంట బాగోలేదని తాలు ఉందని, మ్యాచ్ రావడం లేదని అనేక రకాలుగా రైతులను దోచుకున్న ప్రభుత్వాన్ని హుజురాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో దళిత సోదరులు, రైతులు విద్యార్థులు, మేధావులు కెసిఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంటికి పంపటం తప్పదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ అన్నారు. అనేక సందర్భాల్లో దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తానన్న కెసిఆర్ కు దళిత సోదరులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమారస్వామి, వెంకటేశ్వర్లు, మాజీ వార్డు మెంబర్ గుడ్ల వెంకన్న, జిల్లా ముత్తయ్య, నరసయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *