కస్టమ్ మిల్లింగ్ పూర్తి కాకుంటే చర్యలు

కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ చర్యలు చేపట్టాలి
అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :
యాసంగి పంటకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్(సి.యం.ఆర్) డెలివరీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లర్ లను అధనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ చాంబర్ లో రైస్ మిల్లర్ లు, ఎఫ్.సి.ఐ., పౌర సరఫరాల శాఖ అధికారులు,ఎం.ఎల్.ఎస్.పాయింట్ ఇంచార్జి లు, పోలీస్,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లతో సమావేశం నిర్వహించి కొత్త రేషన్ కార్డుల జారీ,సి.యం.ఆర్ దెలువరీ,ప్రజా పంపిణీ బియ్యం చౌక ధర దుకాణాలకు చేరవేత వంటి అంశాలు సమీక్షించారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సి.యం.ఆర్ డెలివరీ బియ్యం నిల్వ చేయుటకు గోదాంలలో స్థలం గుర్తించాలని,హమాలీ లు ఇబ్బంది లేకుండా చూడాలని ఎఫ్.సి.ఐ. జిల్లా మేనేజర్ ను ఆదేశించారు.డైనమిక్ కీ రిజిస్టర్ రాగానే ఎం.ఎల్.ఎస్.పాయింట్ ఇంచార్జి లు ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం చౌక ధర దుకాణాల కు సకాలం లో చేరవేయలని,అవసరమైతే అదనంగా వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.ఎం.ఎల్.ఎస్.పాయింట్ ల నుండి బియ్యం చౌక ధర దుకాణాలకు చేరవేసి పంపిణీ అనంతరం గన్నీ లు వానాకాలం పంట నిమిత్తం సేకరణ చేయాలని పౌర సరఫరాల డి.యం.ను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిమిత్తం తహశీల్దార్ లు డి.టి.ల ద్వారా విచారణ చేసి డి.ఎస్.ఓ.లాగిన్ కు పంపాలని అన్నారు.ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,డి.యస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి, ఎఫ్.సి.ఐ. జిల్లా మేనేజర్ గోయల్,సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *