పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక డంపింగ్ యార్డ్ పరిశీలన – సివిల్ సప్లై మేనేజర్

అక్షిత న్యూస్, మాడుగులపల్లి: మండలంలో ఇసుకబావి గూడెం గ్రామంలోనాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా మండల ప్రత్యేక అధికారి సివిల్ సప్లై జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు పరిశీలించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం పల్లె ప్రకృతి డంపింగ్ యార్డ్ స్మశాన వాటికలు త్వరగా పూర్తి చేసినందుకు ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొకలు నాటాలని ప్రజా ప్రతినిధులను కోరినారు ఏ సమస్య ఉన్నా పరిష్కారం అయ్యేలా చూడాలని ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకొని చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జితేందర్ రెడ్డి ఎం పీ ఓ రవికుమార్ సర్పంచు నిమ్మల గోవిందమ్మ. పిఎసిఎస్ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్, ఉప సర్పంచ్ మంజులబిక్షం, పంచాయతీ కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *