కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

  •  సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
  •  వైద్య సిబ్బంది అందుబాటులోఉండాలి
  •  జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్

తెలకపల్లి, అక్షిత ప్రతినిధి: కోవీడు నివారణ వ్యాక్సినేషన్ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని నాగర్ కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్ అన్నారు శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమలవుతున్న కోవిద్ వాక్సినేషన్ కార్యమాన్ని, ఎన్. డి.డి. కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. కోవిద్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించి అర్హులైన వారందరికీ వాక్సినేషన్ అందించేలా చూడాలని, రెండవ డోస్ సమయం అయినవారందరికి ఫాలో అప్ చేసి వాక్సినేషన్ కార్యక్రామాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఎన్. డి.డి.లో భాగంగా 1సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ అల్బెన్దజోల్ మాత్రలు వేయాలని ఏ ఒక్కరిని కూడా వదిలేయొద్దని సూచించారు. వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించెల చూడాలని నిల్వ నీరు ఉండకుండా దోమలు వృద్ధి చెందకుండా చర్యలు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకొనేలా ప్రజలను చైతన్య పరచాలని వైద్య సిబ్బందికిసూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మునైజాషన్ అధికారి డా.సాయినాథ్ రెడ్డి డి.పి.ఓ. రేనయ్య, విద్య సాగర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *