ర్యాలీని విజయవంతం చేయాలి: నాయిని రాజేందర్ రెడ్డి

అక్షిత న్యూస్, పర్వతగిరి: అధికంగా పెరిగిన పెట్రోల్ డిజిల్, వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ ఏఐసిసి/టిపిసిసి ఆదేశాల మేరకు ఈ నెల 12న దేశ వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో, మరియు 16న చలో రాజ్ భవన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి కోరారు. శనివారం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ అందులో భాగంగా వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లాల నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలతో ఈ నెల 12 న ఉదయం 9 గంటలకు కాజిపేట చౌరస్తా నుండి హన్మకొండ కాంగ్రెస్ భవన్ వరకు సైకిల్ లతో ర్యాలి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు బిజెపి మరియు టిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని ప్రజా కంటక పాలన ఆపకపోతే మోడీ, కేసిఆర్ ప్రభుత్వాలు గద్దె దిగడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. టిఆర్ఎస్,బిజేపి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై రోజుకు 30 పైసలు పెంచుకుంటూ పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని, బ్యారెల్ రేటు, క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినా కూడా పెట్రోల్, డిజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం డిమోనిటైజేషన్ విషయంలో, జిఎస్టి విషయంలో, వ్యవసాయ చట్టం తీసుకువచ్చిన విషయంలో కాని రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి చట్టాలను సమర్థిస్తూ తీర్మానాలు చేసి పంపిన బిజేపికి మిత్ర పక్షమైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కరోన కష్ట కాలంలో పెట్రోల్ డిజిల్ ధరలు పెరిగినప్పుడు పేద ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్ లు కనీసం తగ్గించకుండా విపరీతంగా పెంచుతున్నారు.దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల పాలనలో పెట్రోల్ మీద డీజిల్ ధరలు 60 రూపాయలు దాటలేదని, కాని ఈ ఏడు సంవత్సరాలల్లో పెట్రోల్ డీజిల్ మీద 100 రూపయలు దాటినా చరిత్ర ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి నియమకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనుత్తేజం, ఉత్సాహం పెరిగిందని, దీనికి ఉదాహరనే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చిన జనాదరణ అని అన్నారు. రేవంత్ రెడ్డి యువ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్, పిసిసి కార్యదర్శి మరినేని వెంకట్రావు, వరంగల్ అర్బన్ జిల్లా కిస్సాన్ ఖేత్ చైర్మన్ పింగిలి వెంకట్రాం నరసింహా రెడ్డి, వరంగల్ జిల్లా శక్తి యాప్ చైర్మన్ పిన్నింటి అనిల్ రావు, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పర్వతగిరి మండల పార్టీ అద్యక్షులు జాటోతు శ్రీనివాస్, ఐనవోలు మండల పార్టీ అద్యక్షులు వడిచర్ల శ్రీనివాస్, హసన్ పర్తి మండల పార్టీ అద్యక్షులు పొరెడ్డి మల్లారెడ్డి, బోట్ల మహేందర్ ఎంపి.టి.సి, నాయకులు దండు రంజిత్, రంగు రంజిత్, నరుకుడు రవీందర్, కందగట్ల అనిల్, డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *