akshitha - srpt collector

పల్లెలు పట్టణాలకు పోటీగా నిలవాలి – జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి

సూర్యాపేట, అక్షిత బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లే ప్రగతి ద్వారా గ్రామాలలో మరింత ప్రగతి కనబడుతుందని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. అభివృద్ధి పనులు పెండింగ్లో ఉంచొద్దని పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని మహమ్మదాపురం గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, సెగిగ్రేషన్ షెడ్ లను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించి మాట్లాడారు శ్మశాన వాటికను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినప్పటికి పనులలో పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు జాప్యం జరిగితే ఊరుకోబనని సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో రెండుమూడు రోజుల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలలో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని అలాగే హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. గ్రామాలలో అభివృద్ది నిరంతర ప్రక్రియని ప్రజల భాగస్వామ్యం తో సాధ్యమని అదికారులు ఆదిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజినీ సుధాకర్, పంచాయితీ కార్యదర్శి జానయ్య,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *