సెంట్రల్ నర్సరీలకు ప్రాధాన్యత నివ్వాలి

మున్సిపల్ పరిధిలో లేఅవుట్ లను పరిశీలించాలి

పట్టణాలలో సెంట్రల్ నర్సరీలు ఏర్పాటు చేయండి

హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షించాలి

పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలి

ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్.

సూర్యాపేట, అక్షిత బ్యూరో :పట్టణాలలో సెంట్రల్ నర్సరీల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత కల్పించాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో కలసి హైదరాబాద్ నుండి మున్సిపల్ శాఖలకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పట్టణాలలో లే అవుట్ లను పరిశీలించి ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని కమిషనర్లు ఆదేశించారు. పట్టణాలలో ప్రభుత్వ, ప్రవేట్ భూములను సేకరించి లేఅవుట్ ను ఎప్పటికప్పుడు అభివృద్ది చేయాలని అన్నారు. లేఅవుట్ లకు పది శాతం కంటే తక్కువ భూమి ఇస్తే వెంటనే రికవరీ చేయాలని సూచించారు. హరిత హారంలో నాటిన మొక్కలకు ట్రీ గార్డ్స్ ఏర్పాటుతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అలాగే పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని వార్డులలో పారిశుధ్య పనులను నిరంతరం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే వర్షాలు పడు పడుచున్నందున దోమలతో జ్వరాలు ప్రబలకుండా ఉదయం, సాయంత్రం ఫాగింగ్ చేయాలని అన్నారు. పట్టణ పరిధిలో ఉన్న పార్కులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో అభివృద్ది పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చర, స్థిరాస్తుల పై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత తో పాటు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నా మని పట్టణాలలో సెంటల్ నర్సరీల కొరకు స్థల సేకరణ చేయనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ కమిషనర్లు సూర్యాపేట రామానుజుల రెడ్డి, నేరెడుచర్ల గోపయ్య, తిరుమలగిరి శ్రీనివాస్, హుజూర్ నగర్ నరేష్ రెడ్డి, కోదాడ నాగేంద్ర బాబు, ఏ. ఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *