అధైర్యపడొద్దు…అండగా ఉంటాం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన నకిరేకంటి కిరణ్ కుమార్ కుటుంబానికి సిద్దార్ధ భరోసా

నిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించి రూ.1,25,000 సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కు అందజేత

కష్టమొచ్చిన ప్రజలకు కంటికి రెప్పలా భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపదొచ్చినా… కష్టమొచ్చినా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్దార్ధ ఉద్ఘాటించారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకే ఆయన నిరంతరం ప్రయత్నిస్తుంటారని కితాబిచ్చారు. మహోన్నత ఆశయాలు, నిబద్ధత, సమజాసేవ చేయాలన్న సువిశాల ధృక్పథం ఉన్న నల్లమోతు భాస్కర్ రావు కొడుకుగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ప్రజల కోసమే నిరంతరం తపించే భాస్కర్ రావు లాంటి సహృద్భావాలు గల వ్యక్తి తమ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా రెండుసార్లు ఎన్నికకావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు నియోజవర్గ ప్రజలు పదేపదే పేర్కొనడం తనకు గర్వంగా ఉందని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. ఆయన స్ఫూర్తి తో ప్రజాసేవలో అందరికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు నకిరేకంటి కిరణ్ కుమార్ గతవారం మొల్కపట్నం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ కుమార్ను ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్దార్ధ గురువారం పరామర్శించారు. కిరణ్ కుమార్ వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.1,20,000 ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీ చెక్కును సిద్దార్ధ అందజేశారు. కిరణ్ కుమార్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కిరణ్ కుమార్ కు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కిరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్యసేవలను అందించాలని డాక్టర్లను కోరినట్టు సిద్దార్ధ తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో తన ఆటపాటలతో ప్రజలను కిరణ్ కుమార్ చైతన్యపరిచారు. గ్రామాల్లో తిరుగుతూ కళాజాతలను నిర్వహించి ప్రత్యేక రాష్ట్ర సాధన ఆవశ్యకతను వివరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కిరణ్ కుమార్ వైద్య సేవల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సహకారం అందించాలని సీఎంవో కార్యాలయాన్ని భాస్కర్ రావు అభ్యర్ధించారు.

ఆపద్బాంధవుడు కేసీఆర్

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని సిద్దార్ధ అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని సిద్దార్ధ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *