సిఎంఆర్ ఎఫ్ తో… పేదలకు మెరుగైన వైద్యం

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిరుపేదలకు వరమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.60వేలు చెక్కును, ఆమనగల్లుకు చెందిన సునీతకు మంజూరైన రూ.40వేలు చెక్కులను భాస్కర్ రావు మంగళవారం అందజేశారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమములో సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీపీ కరుణాకర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ పుట్టల భాస్కర్, కృపాకర్ రావు, జేఏసీ చైర్మన్ ధర్మపాల్ రెడ్డి, ఎంపీపీ పుట్టల సునీత సైదులు, వైస్ ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, ఎంపీటీసీలు చైతన్య, శ్రీరాం రెడ్డి, రాములమ్మ, మేక రవి, పుట్టల పాల్, ప్రతాప్, నాగవెల్లి శంకర్, సర్పంచులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, మజ్జిగపు సుధాకర్, అంకెపాక రాజు, దేశిరెడ్డి లక్ష్మి, అనిరెడ్డి నాగలక్ష్మి, వల్లబట్ల ఝాన్సి, కృష్ణవేణి, సైదులు, కట్టా మల్లేష్ గౌడ్, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *