అభాగ్యులకు ఆర్ధిక భరోసా

 సంక్షేమ పథకాల అమలులో దేశానికే దిక్సూచి ‘
* ధీరావత్ రుక్మిణీకి రూ.45వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

భాస్కర్ రావు 
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఆపదలో ఉన్న అభాగ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక భరోసా కల్పిస్తోందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్) నుంచి దామరచర్ల మండలంలోని కేజేఆర్ కాలనీకి చెందిన ధీరావత్ రుక్మిణీకి మంజూరైన రూ.45,000 చెక్కును స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు అందజేశారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్స చేయించు కునేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జడ్పీటీసీ ఆంగోతు లలిత హాతీరాం నాయక్, సర్పంచ్ యమునా రాంసింగ్, ఎంపీటీసీ వీరా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *