ఆపద్బాంధవుడు… సీఎం కేసీఆర్

24 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణి

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :  కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో శేషాద్రి నగర్ కు చెందిన 24 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా నిరుపేదలను ఈ విధంగా ఆదుకున్నది లేదని ప్రజా సంక్షేమమే పరమావధి గా ముఖ్యమంత్రి కెసిఆర్ నిరు పేదల పాలిట దేవుడుగా నిలుస్తున్నారని అన్నారు. బాలానగర్ ఫ్లేఓవర్ కు బాబు జగ్జివన్వన్ రామ్, నామకరణం చేసినందుకు కృతజ్ఞతగా ఇంద్రా నగర్ అంబేత్కర్ సంఘం కమిటీ సభ్యులు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని కలసి సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *