కార్మికుల పక్షపాతి… సీఎం కేసీఆర్

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా
కరెంట్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కార్మికుల పక్షపాతి అని డిస్కం ప్రధానకార్యదర్శి పి.కరెంట్ రావు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేయనున్నట్టు భరోసా ఇచ్చారు. మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్ వీకేఎస్) కార్యవర్గ సమావేశం, నూతన డివిజన్ బాడీ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కరెంట్ రావు పాల్గొని మాట్లాడారు. కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక కార్మిక సంఘం టీఆర్ వీకేఎస్ అని కరెంట్ రావు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అనేక విద్యుత్ సమస్యలను అధిగమించామని అన్నారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, ఆర్టీజెన్స్ బదిలీల గురించి వివరించారు. దీర్ఘకాలికంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 23,000 మంది ఆర్టీజెన్స్ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారని, వారి సేవలను రెగ్యులరైజ్ చేయాలని ప్రతిపాదించారని అన్నారు. అంతేగాకుండా రూ.19,548 నుంచి రూ.29,743 కన్సాలిడేటెడ్ పే వర్తింపజేయాలని అధికారులను ఆదేశించిన విషయాన్ని కరెంట్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం టీఆర్ వీకేఎస్ డివిజన్ నూతన బాడీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా ఆదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గా మడుపు సైదులు, హాలియా సబ్ డివిజన్ అధ్యక్షులు రమావత్ శ్రీను నాయక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన బాడీ సభ్యులను కరెంట్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ నాయకులు గుంటూరు శ్రీనివాస్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్న బాలు, డివిజన్ నాయకులు శ్రీను, మురళి, వెంకన్న, సింగ్, ఆర్టీజెన్ నాయకులు కృష్ణ, ధర్మ, వెంకట్ రెడ్డి, కొల్లి వెంకటయ్య, నాగయ్య, సైదులు, గౌస్, జానిమియా, చాంద్ పాషా, మహిబలి, లైన్ మాన్ శ్రీను, నగేష్, వినోద్, గోపి, శ్రీను, తుల్సియా, రాష్ట్ర నాయకులు గణేష్, రెడ్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *