పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య

*ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి*

నడిగూడెం, అక్షిత ప్రతినిధి :

భార్యా భర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో భార్య తన ఇద్దరు పిల్లలను చంపి ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి నడిగూడెం మండలం మండలంలోని రామాపురంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్న పోలిశెట్టి శ్రీనాథ్ కు భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు.మౌనిక వారి మేనమామ కుటుంబాల మధ్య భూమి విషయంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మౌనిక మేనమామ ఇంట్లో జరిగిన శుభకార్యానికి తన భర్త శ్రీనాథ్ హాజరై య్యాడు. ఇంటికి తిరిగి వచ్చిన బర్త శ్రీనాథ్ తో మౌనిక తమకు పడని కుటుంబసభ్యులు ఇంటికి ఎందుకు వెళ్లారని వాగ్వాదానికి దిగింది. దీంతో శ్రీను తన భార్యతో ఎలాగు కార్యక్రమానికి వెళ్లి వచ్చాను అని సర్దిచెప్పి గ్రామంలో పేషెంట్ల ను చూసేందుకు వెళ్లాడు. దీంతో మౌనిక తమతో భూవివాదాలున్న తమ బంధువుల ఇంటికి భర్త వెళ్లడాన్ని జీర్ణించుకోలేక క్షణికావేశానికి గురై ముందు తన పిల్లలిద్దరికీ ఉరివేసి చంపి, ఆ తర్వాత తాను ఇనుప వైరు తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామంలో పేషెంట్లను చూసేందుకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనాధ్ తలుపు తీసేసరికి ఇంట్లో తన భార్య మౌనిక (28), కూతురు లాక్షిత (3) కుమారుడు(1) విగతజీవులుగా పడి ఉన్నారు.దీంతో శ్రీనాథ్ అరుస్తూ కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ముక్కు పచ్చలారని పసిపిల్లలు తల్లి క్షణికావేశంతో ఉరివేసి చంపడంతో కుటుంబ సభ్యులు బంధువుల, రోదనలు మిన్నంటాయి.కాగా మౌనిక ది నడిగూడెం మండలం కేశవపురం గ్రామం కాగా భర్తది చివ్వెంల మండలం అక్కలదేవి గూడెం గ్రామం.కాగా మౌనిక ఆత్మహత్య వెనుక భూ వివాదాలే ఉన్నాయా.. మరేవైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *