పేదలకు చలసాని ఆసరా

*పేదలకు చలసాని చేయూత.*
@ *బియ్యం, నిత్యావసర సరుకుల పంపీణీ..*
____________________________

ఆపదలో తోడుంటాం…..అండగా మేముంటాం ..” అంటూ.. భరోసా కల్పిస్తూ పేద ప్రజలకు ఆపన్నహస్తాన్ని అందించారు జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు…సీనియర్ పాత్రికేయులు *చలసాని శ్రీనివాసరావు*.

నేరేడుచర్ల, అక్షిత న్యూస్ :

కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయి కొంత ఆర్థిక ఇబ్బందులకు గురైన 100 పేద కుటుంబాలకు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో… *చలసాని రాజీవ్ యువసేన* నేతృత్వంలో చేయూతనందించారు.

నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో ఆదివారం పేధలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే సమయంలో… ఆపదలో ఉండే సాటి సమాజాన్ని సహాయం చేసి ఆదుకోవటంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని ఈ సందర్భంగా *చలసాని* పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో..మాజీ వైస్ ఎంపీపీ చలసాని మాధవరావు , స్థానిక సర్పంచ్ పల్లెపంగు నాగరాజు  ,మాజీ సింగిల్విండో చైర్మన్ కొడాలి భాస్కర్రావు , మాజీ సర్పంచ్ మేకపోతుల శ్రీనివాస్  ,ఎంపీటీసీ నందిపాటి గురవయ్య నాగవేణి ,మాజీ సర్పంచ్ బుడిగె ధనమ్మ వెంకటేశ్వర్లు  ,కొడాలి పట్టయ్య ,మేకపోతుల నాగరాజు ,కొడాలి రమేష్ బాబు ,కొండయ్య , వార్డు నెంబర్లు కోదాటి కృష్ణయ్య,సoకబుడ్డి శ్రీనివాస్,గజగoటి అక్కయ్య బాబు, యువనాయకులు భార్గవ్ చౌదరి,నాగేందర్, అశోక్, వినోద్, నాగార్జున సతీష్ ,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *