చైత్ర కుటుంబానికి తోడుంటాం

చైత్ర నిందితున్ని ఉరితీయాలి
కుటుంబానికి అండగా ఉంటాం

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ రమేష్ మేడి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఆరేళ్ల బాలికపై అత్యాచారం… హత మార్చిన నిందితున్ని ఉరితీయాలని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాల జేఏసీ చైర్మన్ రమేష్ మేడి అన్నారు. మంగళవారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల జేఏసి అధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాల జేఏసీ చైర్మన్ రమేష్ మేడి మాట్లాడుతూ పసి పిల్లలను సైతం వదలని… కామాంధులు, రాక్షసులు ఉండడం దుర్మార్గమన్నారు. స్వతంత్ర భారతావనిలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్ల పసి పాపను అత్యాచారం చేసి, హత మార్చడం సభ్య సమాజానికి తలవంపులన్నారు. ఆడపిల్లల రక్షణకు పలు చట్టాలు వచ్చినప్పటికి భయం లేకుండా మానవ మృగాలుగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. చైత్ర కుటుంబానికి అన్నీ విధాలుగా అండగా ఉంటామన్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ రాంచందర్ నాయక్ మాట్లాడుతూ చైత్ర హంతకుడిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకోకపోవడం విచారకరమన్నారు. చైత్ర నిందితున్ని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లల రక్షణకు ప్రభుత్వం మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో జేఏసి కో చైర్మన్ గోల్కొండ సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *