చైత్ర నిందితున్ని ఉరితీయాలి

*చిన్నారి చైత్ర మృతి నిందితున్ని బహిరంగంగా ఉరితీయాలి 

*బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి*

*శిశు సంక్షేమ శాఖ మంత్రి ఘటనపై స్పందించాలి*

*బాధిత కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి*

*కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి*

*తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శాంతి యుత నిరసన దీక్ష చేపట్టిన సేవాలాల్ సేన నాయకులు

రవీంద్ర నాయక్

*సూర్యాపేట, అక్షిత బ్యూరో :

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురై మృతి చెందిన ఆరు సంవత్సరాల గిరిజన చిన్నారి చైత్ర మృతికి కారకుడైన రాజును బహిరంగంగా ఉరి తీయాలని సేవాలాల్ సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవీందర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ సంఘ నాయకులతో కలిసి చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నిసరన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభంశుభం తెలియని అమాయక గిరిజన చిన్నారి చైత్రను హత్య చేయడం అమానుషమన్నారు.నిందితున్ని కఠినంగా శిక్షించినప్పుడే బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందన్నారు.’దిశ’కేసులో జరిగిన న్యాయమే చిన్నారి చైత్ర విషయంలో జరగాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్ రూమ్ తో పాటు, ప్రభుత్వ ఉద్యోగం,కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రభుత్వం చెల్లించాలన్నారు.గిరినుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు.దిశ చట్టం లాగానే చరిత్ర (చైత్ర)చట్టం తీసుకొచ్చి నిందితున్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఘటన జరిగి 4రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు బాలు నాయక్, ధరావత్ శంకర్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి ధరావత్ రాజేష్ నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు చందూ నాయక్ నియోజకవర్గ వర్గ అధ్యక్షుడు సేవ్యా నాయక్ జిల్లా నాయకులు శివరాం నాయక్,నాగు నాయక్,తరుణ్ నాయక్,రాజశేఖర్ నాయక్, నర్సింగ్ నాయక్, జాన్సింగ్ నాయక్, వీరు నాయక్, రవినాయక్, చాంప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

*నిరసన దీక్షకు కాంగ్రెస్, బీజేపీ పార్టీల మద్దతు*

చైత్ర కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో చేపట్టిన మొదటి రోజు శాంతియుత నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బెంజారపు రమేష్ గౌడ్, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు చుక్కాని మన్మధ రెడ్డి, జిల్లా నాయకులు బూర మల్సూర్ గౌడ్, చల్లమల్ల నరసింహ తదితరులు తమ సంఘీభావం తెలిపి సేవాలాల్ సేన చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *