వేలాది మందికి ఆనందయ్య మందు పంపిణి

గడప గడపకు ఆనందయ్య మందు
బత్తుల లక్ష్మారెడ్డి
అక్షిత న్యూస్, మాడుగులపల్లి :
మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మాడుగులపల్లి మండలంలోని గ్రామాలు అయినా కల్వల పాలెం, తోపుచర్ల, కుక్కడం, చిరుమర్తి, పాములపాడు గ్రామాలలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కృష్ణపట్నం ఆనందయ్య చేత తయారు చేయబడిన కరోనా మందును గ్రామాల ప్రజలకు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కల్వల పాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకాయల నాగరాజు, చిట్యాల ఎల్లయ్య, మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి బిఎల్ ఆర్ ద్వారా పంపిణీ చేయబడుతుంది అటువంటి కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసినటువంటి ఆయుర్వేదిక మందులు ప్రజలు వాడి వారి యొక్క ఆరోగ్యాన్ని కరోనా బారిన పడకుండా ఉండడానికి తోడ్పడుతుందని ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి బిఎల్ ఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాధవ రెడ్డి , రామచంద్రారెడ్డి శ్యాంసుందర్ ,మంగ యాదయ్య, పుల్లెంల సైదులు ,చిట్యాల సురేందర్ కల్వల పాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకాయల నాగరాజు చిట్యాల ఎల్లయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *