కరోనా పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి

బంగారుగడ్డ ఉన్నత పాఠశాలలో మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ

డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : భావి భారత పౌరులు, భావిభారత నిర్మాతలు నిలయమైనటువంటి పాఠశాలలో అందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కరోనా బారినుండి రక్షించుకోవచ్చని తెలంగాణ హెల్పింగ్ హ్యాండ్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ అన్నారు. మంగళవారం బంగారిగడ్డ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులు అందరికీ శానిటైజర్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించి ఆహార నియమాలను పాటిస్తూ వ్యాయామాన్ని దినచర్యగా పాటిస్తూ జీవన ప్రమాణాలను పెంచుకోవాలని పలు సూచనలు చేశారు. అదేవిధంగా వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు ఆరోగ్య సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వీరనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మౌలిక వసతుల కల్పనకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంసింగ్ ,వీర రాఘవులు, శ్రావణి ఎల్లమ్మ సుకుమారి, ,పారిజాత విజయలక్ష్మి షమీ0 అక్తర్, వెంకటయ్య, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *