బస్సు ట్రిప్పులు పెంచాలి

సిపిఎం ఏజెన్సీ జోనల్ కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్

డిఎంకు డ్రైవర్,కండక్టర్ లద్వారా వినతిపత్రం అందించిన ప్రజలు
*ములుగు,అక్షిత బ్యూరో  :- అంకన్నగూడెం బస్సు సర్వీసులు గతంలో 11 ట్రిప్పులు ప్రయాణికులకు అనుగుణంగా వచ్చేవని,కరోన లాక్డౌన్ అనంతరం కేవలం ఉదయం రెండుట్రిప్పులు సాయంత్రం రెండు ట్రిప్పులు మాత్రమే వస్తుండటంతో ఈ రూట్ లోని ఎనిమిది గ్రామ పంచాయతీల పరిధి ప్రజలు ఇబ్బందీ పడుతున్నారు.ప్రైవేట్ వాహనాలకు ఒకరికి యాభై రూపాయలు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు గుండెబోయిన రవిగౌడ్ అన్నారు.తక్షణమే పాత పద్దతిలో బస్సులు నడుపాలని రద్దుయినా స్పెషల్ ఆఫ్ బస్సులు నడుపాలని కోరుకుంటూ రాయినిగూడెం గ్రామం లో సిపిఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.బస్సు అధికంగా నడుపకపోతే ములుగు బస్టాండ్ ముందు ధర్నా చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో గిరిజనసంఘం జిల్లా నాయకులు తవిటి నారాయణ,మాజీ సర్పంచ్ కల్తీ సమ్మయ్య కల్తీ నవీన్,కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి దేవేందర్ రావు,చేరుకుల రాజయ్య,సమ్మయ్య, సమ్మక్క,సారక్క,గడ్డి లక్ష్మి నారాయణ,సాంబయ్య ముత్తయ్య,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *