బృహత్ పల్లె ప్రకృతి వనం

మొక్కలు నాటాలి… సుందరంగా తీర్చిదిద్దాలి

జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

దేవరకొండ, అక్షిత ప్రతినిధి :
బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు గుర్తించిన స్థలంలో పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గుర్రంపోడ్, కొండమల్లేపల్లి, దేవరకొండ,చింత మల్లేపల్లి మండలం లలో జిల్లా కలెక్టర్ పర్యటించి బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు గుర్తించిన స్థలాలు పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, హరితహారం అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించారు. గుర్రంపోడ్ మండలం మక్కపల్లి జి.పి.వేంకటేశ్వర నగర్ హ్యాబిటేషన్ లో పల్లె ప్రకృతి వనం సందర్శించారు.పల్లె ప్రకృతి వనంలో మొక్కలు చూసి అసంతృప్తి వ్యక్తం చేసి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పెద్ద మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని గ్రామ కార్యదర్శి, ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు.అక్కడే సమీపంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కు గుర్తించిన స్ధలం పరిశీలించి వెంటనే ఫెన్సింగ్, ఇతర పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. కొండమల్లేపల్లి మండలం చిన్న అడిషర్లపల్లి జి.పి.లో బృహత్ పల్లె ప్రకృతి వనం స్థలం పరిశీలన చేసి పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దేవరకొండ మండలం కొండ భీమన పల్లి జి.పి.ల్ పల్లె ప్రకృతి వనం సందర్శించి మొక్క నాటి నీరు పోశారు. అనంతరం మండలం లోని కర్నాటి పల్లి జి. పి.లో బృహత్ పల్లె ప్రకృతి వనం స్తలం పరిశీలన చేసి పనులు మొదలు పెట్టాలని సూచించారు.
చింత పల్లి మండలం లోమదనా పురం లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు స్థలం పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖ తహశీల్దార్, ఎం.పి.డి. ఓ.లకు సూచనలు చేశారు. మండలంలో వింజమూర్, గొల్లపల్లి,,ప్రశాంత పురి తండా,మధనా పురం,బొట్టి మెడ తండా, గోడకండ్ల జి.పి.లలో రహదారి వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించారు. ఖాళీ గా ఉన్న రహదారుల ఇరువైపులా మొక్కలు నాటాలని,చని పోయిన వాటి కొత్త మొక్కలు నాటి సంరక్షణ చేయాలని పంచాయతి కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ తో పాటు డి.ఆర్.డి. ఓ.కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్,తహశీల్దార్ లు,ఎం. పి.డి.ఓ.లు,ఎం.పి.ఓ.లు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *