బీఆర్‌వో నిర్మించిన 63 ప్రాజెక్టులు ఆవిష్క‌రించిన రాజ్‌నాథ్‌

 

ల‌డాఖ్‌ : ల‌డాఖ్‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప‌ర్య‌టిస్తున్నారు. ఇవాళ లేహ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌(బీఆర్‌వో) నిర్మించిన 63 ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల‌ను వ‌ర్చువ‌ల్‌గా ఆయ‌న ప్రారంభించారు. దేశాభివృద్ధిలో క‌నెక్టివిటీ చాలా కీల‌క‌మైంద‌న్నారు. దేశంలో వివిధ ప్రాంతాల‌ను క‌ల‌ప‌డంలో బీఆర్‌వో ముఖ్య పాత్ర పోషించింద‌ని రాజ్‌నాథ్ అన్నారు.ల‌డాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించేందుకు ఉగ్ర‌వాదం ఓ కార‌ణ‌మ‌న్నారు. సామాజిక ఆర్థిక అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో లేద‌న్నారు. ల‌డాఖ్‌ను యూటీగా ప్ర‌క‌టించిన త‌ర్వాత ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌లు త‌గ్గిన‌ట్లు ఆయ‌న చెప్పారు. పెట్టుబ‌డులను ఆక‌ర్షించేందుకు, మౌళిక స‌దుపాయాల‌ను వృద్ధిప‌రిచేందుకు కేంద్రం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్‌తో పాటు ల‌డాఖ్‌ను రాజ‌కీయ ప్ర‌క్రియ మ‌ళ్లీ షురూ కావాల‌న్న‌ది ప్ర‌ధాని మోదీ ఉద్దేశం అన్నారు. ఇప్ప‌టికే ఆ రాష్ట్ర రాజ‌కీయా పార్టీల‌తో ఆయ‌న చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. ల‌డాఖ్ ప్ర‌జ‌ల‌తోనూ ప్ర‌ధాని చ‌ర్చించ‌నున్నట్లు రాజ్‌నాథ్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *