యూనిట్ల ఎంపికలో తొందరొద్దు

ఆదాయం వచ్చేవాటినే ఎంచుకోండి

★ 15 మంది దళితబంధు లబ్ధిదారులకు
కరీంనగర్‌ కలెక్టర్‌ కర్ణన్‌ సూచన

కరీంనగర్, అక్షిత ప్రతినిధి : దళితబంధు లబ్ధిదారులకు అధికార యంత్రాంగం దన్నుగా నిలుస్తున్నది. యూనిట్ల ఎంపికపై చైతన్యపరుస్తున్నది. ‘తొందర పడొద్దు. సమయం తీసుకోండి. ఇంట్లో వాళ్లందరూ కూర్చొని మాట్లాడుకోండి’ అని సూచనలు చేస్తున్నది. ప్రతి అంశంపై అవగాహన కల్పిస్తున్నది. దళితబంధు లబ్ధిదారులు.. అనుభవం, వృత్తి నైపు ణ్యం ఆధారంగా ఏడాదిలోపు రెట్టింపు ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సూ చించారు. మంగళవారం కలెక్టరేట్‌లో దళితబంధు పథకం మొదటి 15 మంది లబ్ధిదారులకు జిల్లా అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. యూనిట్ల ఎంపికకు తొందరపడొద్దని, తగిన సమయం ఇస్తామని తెలిపారు. ఇప్పటికే జీరో ఖాతా ఉన్న లబ్ధిదారులు కూడా బ్యాంకులో కొత్తగా దళితబంధు ఖాతా తెరవాలని సూచించారు. యూనిట్ల నిర్వహణ కోసం గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా 10 నుంచి 15 రోజులు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. తక్కువ సమయంలో ఎకువ ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. 15 మంది లబ్ధిదారుల్లో కొందరు బర్రెలు (డెయిరీ యూనిట్లు), గూడ్స్‌ ట్రాలర్‌, ట్రాక్టర్‌ ట్రాలర్‌, ఎర్టిగా కారు, సూపర్‌బజార్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, లేడీస్‌ ఎంపోరియం యూనిట్లు ఎంపిక చేసుకున్నట్టు తెలిపారు. వాహనాలు ఎంపిక చేసుకొన్నవారికి బుధవారం లెర్నింగ్‌ లైసెన్స్‌లు జారీచేయాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. డెయిరీ యూనిట్లను ఎంచుకున్నవారిని కరీంనగర్‌ డెయిరీకి తీసుకెళ్లి నిర్వహణ, దాణా, పాలు తీయడం, మారెటింగ్‌పై అవగాహన కల్పించాలని పశుసంవర్ధకశాఖ అధికారిని ఆదేశించారు. వీరికి 5 బర్రె లు, షెడ్డు నిర్మాణం, ఇన్సూరెన్స్‌, ఒక సంవత్సరం దాణాకు అయ్యే మొత్తం ఖర్చుకు ప్రణాళికలు తయారుచేసి సమర్పించాలని చెప్పారు. మెడికల్‌షాపు యూనిట్‌ ఎన్నుకున్నవారికి ఫార్మసిస్ట్‌ సర్టిఫికెట్‌తో లైసెన్సు ఇప్పించాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల షాపు యూనిట్ల ను ఎంచుకున్నవారికి అవసరమైన లైసెన్స్‌ ఇప్పించాలని వ్యవసాయాధికారికి సూచించారు. ప్రతి గ్రామంలో కిరాణా, టెంట్‌హౌజ్‌లు ఎకువగా ఉన్నాయని, వాటిని ఎంచుకుంటే ఆదాయం అవకాశాలు తకువ ని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్‌కుమార్‌ తది తరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను అధి కారులు పద్మనగర్‌లోని కరీంనగర్‌ పాల డెయిరీకి తీసుకెళ్లారు. ఆవుల షెడ్డు, వాటికి కావాల్సిన దాణా, పెంపకంపై అవగాహన కల్పించారు. వర్మీ కంపోస్టు ఎరువులను ఎలా తయారుచేయవచ్చో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *