బస్తీ దవాఖానాల భరోసా

 కురుస్తున్న వానలకు

విజృంభిస్తున్న విష జ్వరాలు

★ డెంగ్యూ, మలేరియా, దగ్గు, జలుబు
రోగాలతో బాధపడుతున్న ప్రజలు

★ ఉచితంగా మందులు,
టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది

★ గ్రేటర్‌లో 224 బస్తీ దవాఖానాల్లో
పేదలకు ఉచితంగా చికిత్సలు

★ రోజుకు 100 మందికి వైద్యం
అందిస్తున్న బస్తీ దవాఖానాల సిబ్బంది

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : హైదరాబాద్ నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో పేద ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. పై వేటు ఆసుపత్రులకు వెళ్లాలంటే లక్ష రూపాయలు చెల్లించకలేక సమీపంలో ఉన్న బస్తీ దవాఖానాలకు వెళితే వైద్యంపై భరోసా కల్పిస్తున్నాయి. గతవారం రోజుల నుంచి వివిధ బస్తీల ప్రజలు చికిత్సల కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉచిత సేవలు ప్రైవేటు ఆసుపత్రులకంటే నా ణ్యంగా అందిస్తుండటంతో ప్రజలు దవాఖానాల సేవలపై హరం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఒక డాక్టరు, నర్సు, కాంపౌండర్ సే వలందిస్తూ ఉదయం 9గంటల నుంచి సాయంత్ర 7 గంటల వరకు అందుబాటులో ఉండటంతో డెంగ్యూ, మలేరియా, డయేరియా, దగ్గు, జలుబు, జ్వరం, ఇతర ప్లూ లక్షణాలున్న వారంతా బస్తీ దవాఖానాల్లో గంటల తరబడి ఉంటూ వివిధ రకాలు పరీక్షలు చేయించుకుని ఉచి తంగా మందులు తీసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో 224 బస్తీ దవా ఖానాలో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. రోగుల కు 2006 కాల మందులు, 60రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధుల విజృంభణతో రోజుకు 100 మంది వరకు వస్తున్నట్లు, కొన్ని చోట్ల 120 మంది రోగులు వైద్యం కోసం వస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంటు న్నారు. ఎక్కువ వనస్థలిపురం, మన్సురాబాద్, మలక్ పేట, సంతోష్ న గర్, కార్వాన్, సైదాబాద్, మెహిదీపట్నం, ముషీరాబాద్, యాకుత్ పురా, డబీర్‌పురా, బేగంపేట, తిరుమలగిరి, కంటోన్మెంట్ వంటి చోట్ల ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు రోగుల రద్దీ ఎక్కువ ఉందని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది సీజనల్ వ్యాధులను వైద్య సిబ్బంది సులువుగా ఎదుర్కొని పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కరోనా సోకే అవకాశం ఉన్నందున్న ర్యాపిడ్ టెస్టులు రోజుకు 25మందికి పైగా చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. వచ్చే నెలల్లో 15 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులతో వైద్యశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో శస్త్రచి కిత్సలు కూడా ఇక్కడే చేసే విధంగా ఆపరేషన్ థియేటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దవాఖానాకు వచ్చి ప్రతి రోగికి వైద్యం సేవలందిస్తామని వెల్లడిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *