బహుజనులకు బాటసారి సర్వాయి పాపన్న

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, అక్షిత ప్రతినిధి : బహుజనులకు బాటసారి సర్దార్ సర్వాయి పాపన్న అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న 371 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన రాజ్యం కోసం వందల సంవత్సరాల క్రితం పోరాటం చేసి భువనగిరి ఖిల్లాపై స్వతంత్ర బహుట ఎగరేసిన బహుజన విప్లవ కారుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. పుట్టుక సాధారణమైన కానీ ఆయన జీవించిన కాలం అసాధారణమైన వ్యక్తిగా, బహుజన శక్తిగా ఎదిగిన ధీశాలి పాపన్న అని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయసాధనకు మనం అందరం కృషి చేయాలని తెలిపారు. బహుజనుల అంతా ఐక్యం కావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహుజనుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. సర్వాయి పాపన్న జీవితాన్ని బహుజనలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సంపేట ఉపేందర్ గౌడ్, సోమగాని సోమేశ్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, సురగాని రాంబాబు గౌడ్, ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు జిల్లా సొసైటీ డైరెక్టర్ కొండ సైదయ్య, సొసైటీ చైర్మన్ రాజేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరావు ,టిఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, పెండెం వెంకటేశ్వర్లు, మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రసాద్, అల్వాల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు లింగయ్య, నాగరాజు,గౌడ ఉద్యోగ సంఘ నాయకులు గుండు పరుశరాములు, కొండ వెంకటేశ్వర్లు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *