ఆగస్ట్ నుంచే థర్డ్ వేవ్

న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి :

ఆగస్టు రెండో వారంలో మూడో వేవ్‌ ప్రారంభం కావొచ్చని ఎస్బీఐ తన పరిశోధనాత్మక నివేదికలో వెల్లడించింది. దేశంలో కరోనా ఉద్ధృతిపై ఎస్బీఐ ఎప్పటికప్పుడు అంచనాలను వెలువరిస్తున్నది. తాజాగా ‘కొవిడ్‌ 19: ది రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత కేసులు, గణాంకాలను బట్టి జూలై రెండో వారంలో రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు తగ్గుతుందని అందులో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. ఆగస్టు రెండో వారంలో కేసుల్లో పెరుగుదల ప్రారంభమై నెల వ్యవధిలోనే గరిష్ఠానికి చేరుకొంటాయి. సెకండ్‌ వేవ్‌ కన్నా థర్డ్‌ వేవ్‌లో 1.7 రెట్లు ఎక్కువ కేసులు నమోదు అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *