ఆరోపణలు తగదు

*అభివృద్ధి చేసే వారిపై విమర్శలు చేస్తే సహించేది లేదు*

*- వెలుగు వెంకన్న వెంటనే క్షమాపణలు చెప్పాలి*

*- పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలి*

సూర్యాపేట, అక్షిత బ్యూరో : రెండు రాష్ర్టాల మధ్య వారధిగా ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని దళిత మహిళ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే సహించలేని నాయకులు అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం తగదని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్ అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన పలువురు స్థాయి లేని కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం స్థానిక రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. గత ప్రభుత్వాల కాలంలో మీరు చేసిన అభివృద్ధి సూర్యాపేట ప్రజలకు తెలుసన్నారు. ప్రజలే మీకు బుద్ధి చెప్పే వరకు తెచ్చుకోవద్దని వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయం కాదన్నారు. రెండు రాష్ర్టాల మధ్య వారధిగా ఉన్న సూర్యాపేటను రాష్ట్రంలో ప్రముఖంగా తీర్చిదిద్దేందుకు చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మీ పాలనలో అర్ధరాత్రి మగాళ్లు సైతం బయట తిరగాలంటే భయపడ్డారని ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, మహిళలు ఎంతో ధైర్యంగా తమ స్వగ్రామాలకు వెళుతున్నారన్నారు. ఓ మహిళ ఇంతలా కష్టపడి అభివృద్ధి చేస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ కౌన్సిలర్ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చైర్ పర్సన్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన వెలుగు వెంకన్న వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యక్తిగత విమర్శలను పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలన్నారు. మరోసారి మా దళితుల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఖబడ్దార్ బహిరంగంగానే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు బోలెద్దు వినయ్, దాసరి దేవయ్య, అనుములపురి రాము, అశోక్, నామా వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *