అసలేం జరుగుతుంది?

శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహాక్షేత్రంలో గత నాలుగు రోజులుగా డ్రోన్‌ కెమెరాలు సంచరిస్తున్నాయి. ప్రతి రోజు రాత్రి సమయంలో డ్రోన్లు ఆలయ పరిసరాల్లో తిరుగుతుండంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు. వాటిని పట్టుకోవడానికి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. దీంతో శ్రీశైలం చుట్టూ ఉన్న నల్లమల అటవీ పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక బృందాలును ఏర్పాటుచేశారు. డ్రోన్లు ఎగురవేస్తున్నవారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *