అంతా మిస్టరీ ?

జంట హత్యల మిస్టరీ ?
విచారణ అంతా గోప్యం

అక్షిత న్యూస్, మాడుగులపల్లి : జంట హత్యల కేసు మిస్టరీ…అంతా గోప్యం. పెద్దల అండ దండ ఉంటే ఎంతటి కేసు అయినప్పటికీ మమ అనిపించగలరు. జంట హత్యల కేసులో తోట యజమాని, మరోవ్యక్తి తీరు పలు అనుమానాలకు తావిస్తుంది. విచారణ సమయంలో పోలిసులు సైతం ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి. కేసును తూతూ మంత్రంగా ముగిoచేందుకు మారణాయుధాలు సైతం పోలీస్ లే ఆరెంజ్ చేసుకున్నట్లు సమాచారం.తోట యజమానికి అనుగుణంగా పోలీసులు కేసును పక్కదారి పట్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే…మండల కేంద్రంలో ఆదివారం జరిగిన హత్యలు పట్ల పలువురు గ్రామస్తులు మూడో వ్యక్తి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు హత్య వెనుక ఉన్న నేరస్తులను వెలికితీసి న్యాయం చేయాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.హత్యకు గురైన వాళ్లు ఒరిస్సాకు చెందిన వారు కాబట్టి నామమాత్రంగా ఎంక్వయిరీ చేసినట్టు పలువురు అనుమానం. భార్య స్వాతి మృతదేహానికి ఒక కిలోమీటర్ దూరంలో భర్త జగన్ ఉరి వేసుకోవడం పట్ల పలు అనుమానాలకు దారి తీస్తుందని, నిజమైన హంతకులను బయటకు తీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి హత్యలు జరిగితే సోమవారం ఉదయం 9 గంటలకు రైతు ఫిర్యాదు చేయడం జరిగింది. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఉదయం 9 గంటల వరకు పోలీసులకు సమాచారం అందక పోవడం రైతు పట్ల పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *