ఆల గడప తొక్కనివ్వo

ఆలగడప తొక్కనివ్వo
దామరచర్ల, వెంపాడు ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు పెట్టుకోండి.
మా భూములు మాగ్గావాలే

మేము మట్టిమనుషులం… మార్క్స్ మావో బుద్ధుడు, జ్యోతిరావు ,సావిత్రి పూలే, పెరియర్, అంబెడ్కర్ కొమురం భీం, చాకలి ఐలమ్మ, కాళోజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులం. మట్టిమనుషులం

ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల భూములను దోచి వ్యాపారస్తులకు పంచి పెట్టడం ధర్మం కాదు. న్యాయం అంత కన్నా కాదు..
ఇది ప్రజా ప్రయోజనం కాదు. భూసేకర అన్యాయమైన విషయం.
అభివృద్ధి కేంద్రీకరణ ఎప్పుడూ మంచిది కాదు. గత పాలకులు అలా చేసే మనుషుల నడుమ ప్రాంతాల నడుమ అసమానతలు సృష్టించి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచారు. వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి ప్రజలందరికీ చెందాలి. ఫలాలు అందరికీ అందాలి
Tsiic ఇప్పటికే ఎన్నో భూములు సేకరించింది. అవన్నీ పడావుబడి వున్నవి
తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఈ పార్కులు ఏర్పాటు చేయాలనుకుంటే అన్ని జిల్లాల లో,
నల్లగొండ జిల్లా అభివృద్ధి అనుకుంటే అన్ని నియోజక వర్గాల్లో , సాగర్ ఆయకట్టు కింద అనుకుంటే సాగర్ కింద వున్న 4 నియోజక వర్గాల్లో., మిర్యాలగూడ నియోజక వర్గంలో అనుకుంటే 4 మండలాల్లో
tsiic దగ్గర వున్న లాండ్ బ్యాంక్ ద్వారా ఏర్పాటుచే యాలి. భూములు లేకుంటే
Tsiic రైతుల దగ్గర రైతులకు ఇష్టమైన ధర పెట్టీ కొనుక్కోవాలి… అంతే గాని ఇలా చట్టనుపయోగించుకుని బలప్రయోగం చేయకూడదు… Tsiic బ్రోకర్ పనులు మానుకోవాలి.. అందులో పనిచేసే వాళ్లకు వ్యవసాయం రైతు మట్టి కష్టం అనే విషయాలు తెలిసినట్లు లేదు.

దామరచర్లలో ప్రభుత్వ భూమి సిద్ధంగా వుంది అందులో ఏర్పాటు చేసుకోవాలి.
పట్టణానికి కేవలం 15 కి.మి దూరంలో ఉన్న దామరచర్ల మండలంలో ఆహార శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేసుకోవడానికి సిద్దపడకుండ రేపో మాపో మిర్యాలగూడ పుర పాలక సంఘంలో కలిసే అవంతీపురం ఆలగడపలో ఏర్పాటుకు ప్రయత్నించడం మూర్ఖపు ఆలోచన. పేదల రైతుల భూములు లాక్కోవడం స్వార్థం. ఎప్పుడూ రైతులే త్యాగాలు చేయాలా?

వేంపాడు దొరలు వందల ఎకరాల ప్రభుత్వ భూములను పరిశ్రమల పేరుతో ఆక్రమించుకున్నారు..
వాటిని స్వాధీనo చేసుకుని అక్కడ ఏర్పాటు చేసుకోండి.

మిల్లర్లు లాభాల కోసం వ్యాపారం చేస్తారు. వాళ్లకు పేద రైతుల భూములు లాక్కొని ఇవ్వడం ఏం అభివృద్ధి.
ఉన్నవాళ్లను దోచి పేదలకు పెట్టేవాళ్ళు హీరోలు అవుతారు కానీ పేదల పొట్టలు కొట్టి తిని బలిసిన వ్యాపారులకు పంచే వాళ్ళు విలన్లు.
ఈ వ్యాపారులు ఏమన్నా రేపు రైతుల కాడ ఎక్కువకు కొంటారా? వినియోగదారులకు తక్కువకు అమ్ముతారా?
ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది. ఏమన్నా పేద దళిత బహుజనుల ఔత్సాహికులకు ఇస్తున్నారా?
లేదే. వ్యాపారం లాభాలు గడిస్తున్నా వాళ్ళే మరింత లాభాల కోసం ముందుకొస్తున్నారు. వాళ్ళే లాభ పడతారు. వాళ్లకు నష్టం వొస్తే బ్యాంక్ లకు ఎగ్గొడతారు. ఈ భూములు ఫరం పేరుతో కొంటున్నారు గాబట్టి మళ్లీ ఎవరికో ఒకరికి అమ్ముకుంటారు.
గత పాలకులు రైతుల కాడ గుంజుకుని సెజ్ ఏర్పాటు చేసి వ్యాపారులకు అప్పజెప్పన. పాలమూరు జిల్లా పోలేపల్లిలో రైతులు ఏమయ్యరో చూడండి. ఆ వ్యాపారులు ఎలవున్నారో చూడండి కరోనా లాంటి కష్ట కాలంలో కూడా ఒక్క మందు బిళ్ళ పంచలేదు పేదలకు.. అప్పుడు పోలేపల్లిని వ్యతిరేకించిన trs పార్టీ కెసిఆర్ ఇవ్వాళ ఇంత దుర్మార్గానికి పాల్పడటం అన్యాయం. మిర్యాలగూడ పట్టణంలో రైస్ మిల్లుల ఎక్కువగా వున్న కోదాడ, నల్లగొండ, గుంటూరు రోడ్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.. చేసిన వేసిన వెంచర్లు అన్ని అలాగే పడివున్నాయి.
నిన్న మొన్నటి దాకా సాగర్ రోడ్ పరిస్థితి అదే ఇప్పు డిప్పుడే కొలుకుంటుంది.
పట్టణంలో ఏ మిల్లుల లేని చోట ఎమ్మెల్యే (వైదేహి) కాలని లాంటివి అభివృద్ధి జరుగుతుంది.
మిర్యాలగూడ పట్టణానికి 4,5 కిలోమీటర్ల పరిధిలో
రేపో మాపో మిర్యాలగూడ పురపాలక సంఘంలో కలిసే ఊర్లల్లో
ఇప్పుడు ఆలగడప చుట్టూ భూములు తీసుకుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆలగడప చిన్న క్యాంపు, జలుభాయి తండ, రాయినిపాలెం, ములకల కాల్వ అవంతీపురం, బాదలాపురం, సుబ్బారెడ్డిగూడెం, కల్వపల్లి, తండా, ఏర్రవులపాడు, గూడూరు, కిస్తాపురం, లక్ష్మీపురం, రుద్రారం, కేశవపురం గ్రామాలు దెబ్బతింటాయి… ప్రజలు నష్టపోతారు. భూముల విలువ పడిపోతుంది.కాలుష్యాలకు పట్టణం కూడా దెబ్బతింటుoది. ఇప్పటికే అతి ఎండలు అతి వానలు.
మిర్యాలగూడ పట్టణ మండల నియోజకవర్గ ప్రజలకు మనవి విజ్ఞప్తి.
భూములు కోల్పోతున్న రైతులకు మద్దతు ఇవ్వడం అంటే సంఘీభావం ప్రకటించడం అంటే మనకు మనం మేలు చేసుకోవడమే. పోరాడుదాం. నిలబడదాం.
పక్కిల్లు తగల బడుతుంటే , ఆ వెలుగులో ఆనందం పొదలనుకుకోడం పైశాచికత్వం అది.

Trs పార్టీ నాయకులు గత పార్టీ నాయకుల లాగనే ప్రభుత్వ భూములు ఆక్రమించుకుoటున్నారు. సాగర్ నుంచి మిర్యాలగూడ మీదుగా ఖమ్మం వరకు సాగర్ ప్రాజెక్ట్ భూములు స్థలాలు అక్రమించుకున్నారు.
రైతుల కాడ ప్రజల ప్రయోజనాల కోసమని తీసుకున్న భూములు స్థలాలు ఎవరు కబ్జా చేశారో చూస్తున్నాం.
.trs ప్రభుత్వం కూడా గత పాలకుల లాగా ప్రభుత్వ భూములు వేలం వేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటుంది. పేద ప్రజలవి మాత్రం తక్కువ ధరకు గుంజుకుంటుంది.
మనది ధనిక రాష్ట్రమే నాయే మరి ఈ నీచ నికృష్ట బు ద్దులెందుకు.
ఎవరెవరి కో భూములు, డబ్బులు దానం చేస్తున్నారు కదా… మరి రైతుల కాడ ఎందుకు ఇంత దిగజారుతు న్నారు..
వ్యాపారులకు లాభం కల్పించాలనుకుoటే ప్రభుత్వ ఖజానా నుండి ఇవ్వండి అంతే గాని రైతుల పొట్టగొట్ట కండి.

అభివృద్ధి కేంద్రీకరణ ఎప్పుడూ మంచిది కాదు. గత పాలకులు అలా చేసే మనుషుల నడుమ ప్రాంతాల నడుమ అసమానతలు సృష్టించి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచారు. వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి ప్రజలందరికీ చెందాలి. ఫలాలు అందరికీ అందాలి.
తెలంగణ అభివృద్ధిలో భాగంగా ఈ పార్కులు ఏర్పాటు చేస్తే tsiic దగ్గర వున్న లాండ్ బ్యాంక్ ద్వారా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి

ఇందుకు పూర్తి బాధ్యత trs నాయకులే, ప్రజాప్రతినిధులే.
గతంలో చంద్రబాబు, వైఎస్సార్ చేసిన తప్పులు దుర్మార్గాలు అన్యాయలే అప్రజాస్వామిక విధానాలే కేసిఆర్ చేస్తున్నాడు..

మిర్యాలగూడలో ఇప్పటికీ ఆటోనగర్ అప్పజెప్ప లేదు.. ఎప్పుడో రైతుల కాడ భూములు తీసుకుని .

జప్తువీరప్ప గూడెంలో చక్కెర పరిశ్రమ పెడతామని చెప్పి ,
రైతులను మోసం చేసి . మభ్య పెట్టి, ప్రలోభ పెట్టి
భూములను తక్కువకు కాజేసిన వాళ్ళు ఇప్పటివరకు అక్కడ ఎలాంటి పరిశ్రమ పెట్టలేదు. కానీ అమ్మిన రైతులు నష్టపోయారు..
నార్కట్ పల్లిలో కామినేని వాళ్లకు వందల ఎకరాల భూములు స్థానిక రాజకీయ నాయకులు రైతుల నుంచి అమ్మిచ్చారు.. వాళ్ళు ఆ భూమిలో ఏమి చేయలేదు.. కాని భూములకు విపరీతంగా ధరలు పెరిగాయి. ఇవి అమ్ముకుంటే కామినేని వారికి లాభం. రైతులకు మాత్రం తీవ్ర నష్టం జరిగింది.

భూములు స్థలాలు పొలాలు కేవలం కొన్ని గజాలు కోసమే సొంత తోబుట్టువులు రక్త సంబంధీకులు లనే
చంపుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఎవడో వ్యాపారస్తులు భూములు లాక్కుంటే ఊరుకుంటారా? భూమి రక్తం కోరుకుంటుంది..

ఆలగడపలో గతంలోనే తెలంగాణా అభివృధ్ధిలో భాగంగా దాదాపు 200 ఎకరాలు పంచదార పరిశ్రమ కు ఇచ్చాము
ఎప్పుడూ మేమే భూములు ఇవ్వాలా త్యాగాలు చేయాలా… ఎంత మాత్రం ప్రజా ప్రయోజనం కానీ బలిసిన వ్యాపారుల కోసం మేము భూములు ఎందుకు ఇవ్వాలి,? ఇవ్వం.

అటు కెసిఆర్ ఇటు trs నాయకులు అటు తెలంగాణా లో ఇటు మిర్యాలగూడ నియోజవర్గo లో అనేక అక్రమాలు అన్యాయాలు అవినీతి దుర్మార్గాలు చేస్తున్నా చూస్తూ భరిస్తున్నమని,కెసిఆర్ కుటుంబానికి బంధువులకు పార్టీ వాళ్లకు దోచి పెడుతున్న చూస్తూ ఊరుకుంటున్నామని
పేదల నోటికాడి భూములు లాక్కుంటే ..
.”.ఊరు ” ,”ఊరు” కునేది లేదు. మేం ఊకునేది లేదు.
చుట్టు గ్రామాలు ఇప్పటికే కాలుష్యంలో కొట్టుమిట్టా డు తున్నాయి.. ఇంకా చంపుతారా
. ప్రభుత్వ భూములు అటవీ భూములు కాజేసిన వాళ్లకు
పులిచింతల ముంపులో , యాదాద్రి థర్మల్ ,ల్లో భూముల లేని బలిసినవాళ్ల కు నష్ట పరిహారం ఇప్పించడం
ప్రభుత్వ భూములు అటవీ భూములు కాజేసిన వాళ్లకు పట్టాలు ఇప్పించడం లాంటి అక్రమా లకు పాల్పడ్డ వాళ్ళే పేదల పొట్టలు గొట్టి బడాసాములకు బట్టలు కట్టాలని చూస్తున్నారు .ఇవ్వాళ పేదల భూములు లాక్కోవల నుకుటున్నారు.

తెలంగణవాదనకు ఎంతో బలమిచ్చాo.
తెలంగాణ రాష్ట్ర బోర్డ్ తొలిసారి ఏర్పాటు చేశాం .
.తెలంగాణ రాష్ట్ర తొలి తీర్మాణం చేశాం.
తెలంగాణా కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు పాదయాత్రలు, చేశాం ఆస్తులు పోగొట్టుకున్నాo.
కరీంనగర్ mp కి kcr రాజీనామా చేస్తే రెఫరండం పెట్టీ ప్రజాభిప్రాయం సేకరిస్తే ఆ ఫలితాలను కెసిఆర్ కరీంనగర్ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుని 2 లక్షల మెజారిటీతో గెలిచి ఇక్కడికి వచ్చి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి తెలంగాణా రాగానే ఏదో చేస్తానని చెప్పి, ఇదా చేసేది.?

దామరచర్ల, వెంపాడు ప్రభుత్వ భూముల్లో

పరిశ్రమలు పెట్టుకోండి.
మా ఊరికి రాకండి మా భూముల జోలికి రాకండి.
పేదల నోటికాడి భూములు లాక్కుంటే ..
.”.ఊరు ” ,”ఊరు” కునేది లేదు.
మేం ఊకునేది లేదు.

మట్టిమనిషి
వేనేపల్లిపాండురంగారావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *