ఏసీబీ వలలో ఎస్సై, కానిస్టేబుల్‌

ఏసీబీ వలలో ఎస్సై కానిస్టేబుల్‌

వేములవాడ, అక్షిత ప్రతినిధి :

ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే కారణంతో పట్టుకున్న ట్రాక్టర్‌ను విడుదల చేసేందుకు డబ్బు డిమాండ్‌ చేసిన ఎస్సై దూలం పృథ్వీధర్‌గౌడ్, స్టేషన్‌ రైటర్‌ ఉరుమల్ల రమేశ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదివారం వలపన్ని పట్టుకున్నారు. మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ  భద్రయ్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోరుట్ల మండలం నాగులపేట గ్రామానికి చెందిన ఆరెల్లి సా యికుమార్‌ ట్రాక్టర్‌ను ఇటీవలే అదే గ్రామానికి చెందిన ఉప్పరపెల్లి నాగరాజు కొనుగోలు చేశారు. ఈనెల 18న కథలాపూర్‌ మండలం తక్కళ్లపెల్లి శివారులోని వాగులోంచి ఇసుక తరలిస్తుండగా పోలీసులు ట్రాక్టర్‌ పట్టుకుని సీజ్‌ చేశారు. కేసు నమోదైంది. స్టేషన్‌ బెయిల్‌తోపాటు ట్రాక్టర్‌ విడుదలకోసం స్టేషన్‌ రైటర్‌ రమేశ్, ఎస్సై పృథ్వీధర్‌గౌడ్‌ తమకు రూ.15వేలు లంచడం ఇవ్వాలని ట్రాక్టర్‌ యజమాని నాగరాజును డి మాండ్‌ చేశారు. అంతడబ్బు ఇవ్వలేనని నాగరాజు వారికి బదులిచ్చారు.చివరకు రూ.10 వేల కు బేరం కుదిరింది. ఈ క్రమంలో శనివారం నా గరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు ఆదివారం మధ్యాహ్నం రూ.10 వేలు స్టేషన్‌ రైటర్‌ రమేశ్‌కు కథలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నాగరాజు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నా రు. ఎస్సై డబ్బు తీసుకోవాలని సూచించడంతోనే  తాను తీసుకున్నట్లు రమేశ్‌ ఏసీబీ అధికారులకు చెప్పారు. దీంతో ఎస్సై పృథ్వీధర్‌గౌడ్, కానిస్టేబుల్‌ రమేశ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్సై పృథ్వీధర్‌గౌడ్‌ నివాసం ఉండే క్వార్టర్‌లో తనిఖీలు చేపట్టారు. ఎస్సై, కానిస్టేబుల్‌ను సోమవారం కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, సీఐలు రవీందర్, రాము, సంజీవ్, తిరుపతితోపాటు 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *