రాబోయే వందేండ్ల కోసం ‘సుంకిశాల’ ఇన్ టేక్ వెల్

రాబోయే వందేండ్ల కోసం ‘సుంకిశాల’ ఇన్ టేక్ వెల్

మంత్రి కేటీఆర్

నాగార్జున సాగర్, అక్షిత ప్రతినిధి :

రాబోయే వందేండ్లను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం సుంకిశాల వద్ద రూ.1450 కోట్ల నిధులతో ఇన్ టేక్ వెల్ ప్రాజెక్టును చేపట్టినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం మంత్రులు జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్ర కుమార్ తో కలిసి సుంకిశాల ఇన్టెక్ వెల్ కు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం బుద్ధవనంను ప్రారంభించారు. హాలియాలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.పెరుగుతున్న హైదరాబాద్ జనాభాకు నీరు అందించే శుభకార్యాన్ని ప్రారంభించుకున్నామని అన్నారు. వచ్చే ఏడాది ఎండాకాలం కల్లా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఓఆర్ఆర్ కాదు ఆర్ఆర్ఆర్ వచ్చినా అక్కడి వరకు నీళ్లు ఇచ్చేలా సుంకిశాలను డిజైన్ చేయనున్నట్టు తెలిపారు.ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 37 టీఎంసీల నీరు అవసరముందని, 2077 నాటికి 77 టీఎంసీల నీరు కావాల్సి వస్తుందన్నారు.హైదరాబాద్ పై 65 టీఎంసీల నీటికుండ ఉండేలా సుంకిశాలను డిజైన్ చేస్తున్నామని అన్నారు. దీని నిర్మాణం పూర్తయితే ఐదేండ్ల పాటు కరువు వచ్చినా తాగునీటికి కొరత ఉండదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనీయతకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని అన్నారు.దేశంలో అతివేగంగా పూర్తయిన ప్రాజెక్టు ఇదని అన్నారు.భారతదేశంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాబోయే 10 నుంచి 15 ఏండ్లలో ఢిల్లీ కంటే తెలంగాణ అభివృద్ధి లో ముందుంటుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.