పోటీ పరీక్షలను ధీటుగా ఎదుర్కోవాలి

ఉచిత పోటీ పరీక్షల శిక్షణను మైనార్టీ విధ్యార్దులు సధ్వినియోగం చేసుకోవాలి

-జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది

ఖమ్మం/ అక్షిత బ్యూరో : ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని మైనార్టీ విధ్యార్దులు సధ్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది సూచించారు.ఖమ్మం నగరం రిక్కా బజార్ స్కూల్ లో తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో గ్రూప్ 1,2,3 అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ పోంది ఏక్కువ మంది ఉధ్యోగాలు సాదించాలని ఆకాంక్షీంచారు.ఈ శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపిజె) జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిమ్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు.అనంతరం ఖాసీం మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత శిక్షణను మైనార్టీ అభ్యర్దులు క్రమశిక్షణ తో పరీక్షలకు సిద్ధమైతే అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారని తెలిపారు.ఎంపిజె సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ సాధిక్ అహ్మద్ విద్యార్థులతో మాట్లాడుతూ సమయపాలన నైపుణ్యంతో పరీక్షలకు సిద్ధమవ్వాలని తెలిపారు. ఎక్కువ గంటలు కష్టపడి చదివి కల నెరవేర్చుకోవాలని అభిలషించారు.ఎక్కువ మంది అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు హాజరయ్యే విధంగా కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు గఫార్ కార్యదర్శులు సతీష్ రజబ్ ఆలీ కోశాధికారి హకీమ్ మీడియా సెక్రటరీ చక్రవర్తి సభ్యులు పాషా రహీమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.