వైద్య సేవలపై భాస్కర్ రావు ఆరా

ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఒక్కసారిగా ఆస్పత్రికి రావడంతో అధికారులు, వైద్యులు, సిబ్బంది హడావుడితో పరుగులు తీశారు. ఎమ్మెల్యే ఆస్పత్రిలోని అన్ని విభాగాలకు స్వయంగా కదులుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న రోగులతో మాట్లాడారు. ” ఏ ఊరి నుంచి వచ్చి ఇక్కడ వైద్యం పొందుతున్నారు. వైద్య సేవలు ఎలాగున్నయ్..? డాక్టర్లు సమయానికి అస్తున్నారా..? వైద్య సిబ్బందితో ఏమైనా ఇబ్బందులున్నాయా ? మందులు ఇస్తున్నారా…?” అంటూ వారికి అందుతున్న వైద్య సేవల గురించి, ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందించారని వైద్యులను సూచించారు. విధుల పట్ల అలసత్వం వహించినట్టయితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అనంతరం శస్త్ర చికిత్స విభాగపు గదులను,ఇటీవల పీడియాట్రిక్ విభాగానికి మంజూరైన 30 గదులను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో, ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకం పెరగాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వసతులు, ప్రమాణాలను పెంపొందించేందు కోసం ప్రభుత్వం నుంచి 74 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్టు భాస్కర్ రావు తెలిపారు. ఆస్పత్రిలో విద్యుత్ సేవలకు అంతరాయం కలగకుండా 100 కేవీ సామర్ధ్యమున్న ట్రాన్స్ ఫార్మర్ ని 150 కేవీ సామర్ధ్యమున్న ట్రాన్స్ ఫార్మర్ కు బదలాయించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.