మాదిగలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

మాదిగలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
త్వరలోనే మిక్కికి ప్రభుత్వ గుర్తింపు
దళితుల అభ్యున్నతికి కేసిఆర్ కృషి
తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : దళితుల అభ్యున్నతి దిశగా సీఎం కేసిఆర్ వ్యుహత్మకంగా వ్యవరిస్తున్నారని తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం గ్రీన్ పార్క్ హోటల్ లో మిక్కి రాష్ట్ర అధ్యక్షులు సుంచు రాజుకుమార్ అధ్యక్షతన జరిగిన మిక్కి వార్షికోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసిఆర్ తో చర్చించి త్వరలోనే మిక్కికి ప్రభుత్వ గుర్తింపు లభించేలా కృషి చేస్తామన్నారు. అన్ని రంగాల్లో మాదిగలు ముందుండాలని, పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లోనూ మాదిగలు వృద్ధి చెందాలన్నారు. రానున్న సాంకేతిక విప్లవానికి అనుగుణంగా మాదిగ యువత ముందుకురావాలన్నారు. గత 22 ఏళ్ళ క్రితం ఇదే గ్రీన్ పార్క్ హోటల్ లో దళితుల అభ్యున్నతికి సంబంధించి కేసిఆర్ సారథ్యంలో మేదిమధనం జరిగిందని, మిక్కి మీట్ గ్రీన్ పార్క్ లో జరుగడం సంతోషంగా ఉందన్నారు. దళితుల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసిఆర్ దళిత బంధును ప్రవేశపెట్టి పటిష్ఠ వంతంగా అమలు చేయడం అభినందనీయమన్నారు. పాడి పరిశ్రమపై ఉన్న మక్కువతో దళిత బంధు లబ్ధిదారులకు కరీంనగర్ డెయిరీతో అనుసంధానం చేశామని సక్సెస్ ఫుల్ గా సాగుతుందన్నారు. దళిత బంధును దళితులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాదం ఫౌండేషన్ చైర్మన్ డా. పగిడిపాటి దేవయ్య మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఎంట్రీ అయిన తొలినాళ్ళల్లో 100 కంపెనీలు స్టార్ట్ అయితే కేవలం 10 కంపెనీలు మాత్రమే సక్సెస్అయ్యాయన్నారు.అలాంటి పరిస్థితుల్లోనూ తాము స్థాపించిన కంపెనీలు విజయ బావుటా ఎగురవేశాయన్నారు. ప్రతి వ్యవస్థలోనూ ఒడిదుడుకులు ఉంటాయని, వాటిని అధిగమించి విజయ తీరాలకు చేరుకో వాలన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలలును సాకారం చేసేందుకు నాదం ఫౌండేషన్ ను స్టార్ట్ చేశామన్నారు. నాదం ఫౌండేషన్ తో రూ. 7 కోట్లతో ఐఐటి, ఎంబిబిఎస్ తదితర కోర్స్ ల్లో విద్యనభ్యసించే విద్యార్థిని, విద్యార్థులకు చేయూత నందిస్తున్నామన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణిలు రత్నప్రభ, రాణి కుముదినిలు మాట్లాడుతూ వ్యాపార రంగంలో చక్కటి పరిణితి రాణించాలన్నారు. ప్రభుత్వ విఫ్, అచ్ఛo పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ మిక్కి ని నోడల్ ఏజెన్సీగా గుర్తించేందుకు సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ ల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తమ నియోజకవర్గంలోని ఒక మండలాన్ని మిక్కి దత్తత తీసుకుని దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు.తొలుత అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సమావేశంలో సాయి మేడి, మిక్కి ఫౌండర్ మహేష్ గోగర్ల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్క నర్సింహా, ఉపాధ్యక్షులు ఆనంద్, కోశాధికారి సుధాకర్, విప్లవ్ గాంధీ, సునిత, సాయి ప్రభ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.