సాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

సాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
ఘటనా స్థలంలో తండ్రి కొడుకుల మృతి.

ఇబ్రహీంపట్నం , అక్షిత ప్రతినిధి:

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లో సుమారు 1:30 గంటల సమయంలో సాగర్ రోడ్డులోని ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద తమ్మలోనిగూడ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుడు ముచ్చర్ల రాములు తండ్రి రాంచంద్రయ్య, వయస్సు – 56 సంవత్సరాలు, వృత్తి లేబర్, కుల – ఎస్సీ -మాదిగ, మేడిపల్లి గ్రామము మరియు అతని కుమారుడు ముచ్చర్ల సోను తండ్రి రాములు, వయస్సు – 11 సంవత్సరాలు,  మేడిపల్లి గ్రామము తమ హోండా షైన్ బైక్  నెంబర్ – టీఎస్ 07 జె ఏ 0498పై యాచారం నుండి మాల్ వైపు వెళుతుండగా, దారిలో వారు ఎస్సార్ పెట్రోల్ బంక్, తమ్మలోనిగూడ గేట్ దగ్గరకు చేరుకుని, పెట్రోల్ బంక్‌లోకి తిరిగే సమయంలో హోండా సిటీ కారులో ఒక డ్రైవర్ యాచారం నుంచి మాల్ వైపు అదే దిశలో వెళుతున్న టీఎస్ 09 ఎఫ్‌డీ 1716 తన వాహనాన్ని అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడిపి వెనుకవైపు నుంచి బైక్ ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్లే వ్యక్తి, అతని కొడుకు కు తీవ్ర రక్తస్రావమై సంఘటన స్థలంలో చనిపోయారు.

Leave A Reply

Your email address will not be published.