- పేసర్ల ప్రతాపం
- 9 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘనవిజయం
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి: వావ్.. రైజర్స్ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. స్టార్లతో కూడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును పేసర్లు నటరాజన్ (3/10), జాన్సెన్ (3/25), ఉమ్రాన్ (1/13) నిప్పులు చెరిగే బంతులతో వణికించారు. ఈ త్రయానికి స్పిన్నర్ సుచిత్ (2/12) తోడవ్వడంతో ఆర్సీబీ బ్యాటింగ్ అయ్యో.. అనిపించేలా సాగింది. దీంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా అద్భుత రన్‌రేట్‌తో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. సుయాశ్ ప్రభుదేశాయ్ (15), మ్యాక్స్‌వెల్ (12) మినహా తొమ్మిది మంది రెండంకెల స్కోరు కూడా దాటలేదు. కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. వీరి ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోగా కేవలం ఆరు ఫోర్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత సులువైన ఛేదనలో అభిషేక్ శర్మ (47) ధాటికి సన్‌రైజర్స్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి గెలిచింది. విలియమ్సన్ (16 నాటౌట్) సహకరించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా జాన్సెన్ నిలిచాడు.
8 ఓవర్లలోనే..: 69 పరుగుల ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ జట్టు పవర్‌ప్లే ముగిసేసరికే 56 రన్స్‌తో విజయం అంచున నిలిచింది. ఓపెనర్ అభిషేక్ ధనాధన్ ఆటతీరును ప్రదర్శించాడు. 4, 5 ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన అతడు ఆరో ఓవర్లో 3 ఫోర్లతో చెలరేగాడు. అయితే గెలుపునకు 5 రన్స్ కావాల్సిన వేళ అభిషేక్ క్యాచ్ అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు త్రిపాఠి (7 నాటౌట్) సిక్సర్‌తో రైజర్స్ ఘనవిజయం అందుకుంది.
వికెట్ల జాతర: ఆరంభంలో జాన్సెన్.. మధ్య ఓవర్లలో ఉమ్రాన్.. చివర్లో నటరాజన్‌ల ముప్పేట దాడికి బెంగళూరు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టుకు రెండో ఓవర్లోనే చుక్కలు కనిపించాయి. పేసర్ జాన్సెన్ వరుస బంతుల్లో డుప్లెసీ (5), కోహ్లీ (0)తో పాటు చివరి బంతికి అనూజ్ రావత్ (0)ను అవుట్ చేయడంతో టాపార్డర్ పెవిలియన్‌కు చేరింది. ఇక రెండు ఫోర్లతో టచ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ క్యాచ్‌ను మిడా్‌ఫలో విలియమ్సన్ డైవ్ చేస్తూ పట్టిన తీరు హైలైట్‌గా నిలిచింది. ఈ వికెట్ నటరాజన్ తీశాడు. అప్పటికి స్కోరు కేవలం 20/4. ఈ దశలో ఐదో వికెట్‌కు సుయాశ్ అత్యధికంగా 27 పరుగులు జోడించాడు. అయితే తొమ్మిదో ఓవర్లో సుయాశ్తో పాటు దినేశ్ కార్తీక్ (0)ను స్పిన్నర్ సుచిత్ అవుట్ చేయడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో చెప్పుకోవడానికేమీ లేకపోయింది. క్రీజులో నిలుస్తాడనుకున్న షాబాజ్ (7) కూడా నిరాశపరిచాడు. టెయిలెండర్లను నటరాజన్ పెవిలియన్ చేర్చగా, ఆఖరి వికెట్‌ను భువనేశ్వర్ తీయడంతో 16.1 ఓవర్లలోనే ఆర్సీబీ కథ ముగిసింది.
బెంగళూరు: డుప్లెసి (బి) జాన్సెన్ 5, అనూజ్ రావత్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 0, విరాట్ కోహ్లీ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 0, మ్యాక్స్‌వెల్ (సి) విలియమ్సన్ (బి) నటరాజన్ 12, ప్రభుదేశాయ్ (స్టంప్డ్) పూరన్ (బి) సుచిత్ 15, షాబాజ్ అహ్మద్ (సి) పూరన్ (బి) ఉమ్రాన్ 7, దినేశ్ కార్తీక్ (సి) పూరన్ (బి) సుచిత్ 0, హర్షల్ పటేల్ (బి) నటరాజన్ 4, హసరంగ (బి) నటరాజన్ 8, హాజెల్‌వుడ్ (నాటౌట్) 3, సిరాజ్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 2, ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 16.1 ఓవర్లలో 68 ఆలౌట్; వికెట్ల పతనం: 1-5, 2-5, 3-8, 4-20, 5-47, 6-47, 7-49, 8-55, 9-65, 10-68; బౌలింగ్: భువనేశ్వర్ 2.1-0-8-1, మార్కో జాన్సెన్ 4-0-25-3, నటరాజన్ 3-0-10-3, సుచిత్ 3-0-12-2, ఉమ్రాన్ మాలిక్ 4-0-13-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ (సి) అనూజ్ రావత్ (బి) హర్షల్ 47, విలియమ్సన్ (నాటౌట్) 16, రాహుల్ త్రిపాఠి (నాటౌట్) 7, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 8 ఓవర్లలో 72/1; వికెట్ పతనం: 1-64; బౌలింగ్: సిరాజ్ 2-0-15-0, హాజెల్‌వుడ్ 3-0-31-0, హర్షల్ 2-0-18-1, హసరంగ 1-0-7-0.