పంత్‌, శార్దూల్‌కు భారీ జరిమానా!

ముంబై: ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌పై ఐపీఎల్‌  నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. శుక్రవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ చివరి ఓవర్‌లో నోబాల్‌ వివాదం దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పంత్‌, శార్దూల్‌తో పాటు సహాయక కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రేలు లీగ్‌ లెవెల్‌-2 నిబంధన అతిక్రమించారని ఐపీఎల్‌ పేర్కొంది. ఈ కారణంగా పంత్‌ మ్యాచ్‌ ఫీజులో 100 శాతం, శార్దూల్‌ ఫీజులో 50 శాతం, ఆమ్రేపై 100 శాతం మ్యాచ్‌ ఫీజుతో పాటు ఒక మ్యాచ్‌ నిషేధాన్ని విధించారు. మెక్‌కాయ్‌ వేసిన మూడో బంతిని నోబ్‌గా ప్రకటించాలని డగౌట్‌లో ఉన్న పంత్‌తో పాటు శార్దూల్‌ డిమాండ్‌ చేశారు. దీనికి అంపైర్ల నుంచి స్పందన లేకపోవడంతో తమ ఆటగాళ్లను బయటికి రమ్మంటూ పంత్‌ సైగలు చేశాడు. అలాగే ఈ విషయం మాట్లాడేందుకు ఏకంగా ఆమ్రేను మైదానంలోకి పంపడంతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.