చెన్నై చిత్తు.. సన్‌రైజర్స్ తొలి గెలుపు

ముంబై: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైను సన్‌రైజర్స్ బౌలింగ్ యూనిట్ అద్భుతంగా కట్టడి చేసింది. కేవలం మొయీన్ అలీ (48) మాత్రమే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అంబటి రాయుడు (27), చివర్లో జడేజా (22) ఫర్వాలేదనిపించారు.

ఈ క్రమంలో 20 ఓవర్లకు చెన్నై జట్టు 7 వికెట్లు కోల్పోయి కేవలం 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యఛేదనలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (32) నెమ్మదిగా ఆడినప్పటికీ.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (75)కు చక్కటి సహకారం అందించాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (39 నాటౌట్) మరోసారి తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. చివర్లో అభిషేక్ అవుటైన తర్వాత వచ్చిన పూరన్ (5 నాటౌట్) కూడా ఒక బౌండరీ బాదాడు.

దీంతో సన్‌రైజర్స్ జట్టు 17.4 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి, చెన్నైపై 8 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఇది ఈ టోర్నీలో చెన్నైకు వరుసగా నాలుగో ఓటమి కాగా.. సన్‌రైజర్స్‌కు తొలి విజయం కావడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.