- ఆఖరి రెండు బంతుల్లో తెవాటియా సిక్సర్లు
- శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్.. పంజాబ్‌పై గుజరాత్ గెలుపు
- నరాలు తెగే ఉత్కంఠ పోరులో గుజరాత్ ఘన విజయం
- సాధించింది. కళాత్మక ఇన్నింగ్స్‌తో గిల్ వేసిన పునాదిపై..
ముంబై: చివరి వరకు ఉత్కంఠ ఊపేసిన పోరులో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కొత్త ఫ్రాంచైజీ.. తాజా సీజన్లో వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ (27 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా.. శిఖర్ ధవన్ (35), జితేశ్ శర్మ (23), రాహుల్ చాహర్ (14 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3, దర్శన్ నల్కండే రెండు వికెట్లు పడగొట్టారు. ఒక దశలో 13 ఓవర్లకు 124/3తో పటిష్టంగా కనిపించిన పంజాబ్‌ను గుజరాత్ బౌలర్లు మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. చివర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 15; 2 సిక్సర్లు), రాహుల్ చాహర్ ధాటిగా ఆడారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (59 బంతుల్లో 96; 11 ఫోర్లు, ఒక సిక్సర్) తృటిలో శతకం చేజార్చుకోగా.. కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ (35; 4 ఫోర్లు, ఒక సిక్సర్) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆఖరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) రియల్ హీరోగా అవతరించాడు. పంజాబ్ బౌలర్లలో రబడ 2 వికెట్లు పడగొట్టాడు. గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా తొలి పోరులో చెన్నైతో హైదరాబాద్.. మలి పోరులో బెంగళూరుతో ముంబై తలపడనున్నాయి.
స్కోరుబోర్డు
పంజాబ్: మయాంక్ (సి) రషీద్ (బి) హార్దిక్ 5; ధవన్ (సి) వేడ్ (బి) రషీద్ 35; బెయిర్‌స్టో (సి) తెవాటియా (బి) ఫెర్గూసన్ 8; లివింగ్‌స్టోన్ (సి) మిల్లర్ (బి) రషీద్ 64; జితేశ్ శర్మ (సి) గిల్ (బి) దర్శన్ 23; స్మిత్ (సి) గిల్ (బి) దర్శన్ 0; షారుక్ (ఎల్బీ) రషీద్ 15; రబాడ (రనౌట్) 1; రాహుల్ చాహర్ (నాటౌట్) 22; వైభవ్ (బి) షమి 2; అర్ష్‌దీప్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 189/9. వికెట్ల పతనం: 1-11, 2-34, 3-86, 4-124, 5-124, 6-153, 7-154, 8-156, 9-162. బౌలింగ్: షమి 4-0-36-1; హార్దిక్ 4-0-36-1; ఫెర్గూసన్ 4-0-33-1; రషీద్ 4-0-22-3; దర్శన్ 3-0-37-2; తెవాటియా 1-0-24-0.
గుజరాత్: వేడ్ (సి) బెయిర్‌స్టో (బి) రబాడ 6; గిల్ (సి) మయాంక్ (బి) రబాడ 96; సుదర్శన్ (సి) మయాంక్ (బి) చాహర్ 35; హార్దిక్ (రనౌట్) 27; మిల్లర్ (నాటౌట్) 6; తెవాటియా (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 190/4. వికెట్ల పతనం: 1-32, 2-133, 3-170, 4-172. బౌలింగ్: వైభవ్ అరోరా 4-0-34-0; అర్ష్‌దీప్ 4-0-31-0; రబాడ 4-0-35-2; చాహర్ 4-0-41-1; స్మిత్ 3-0-35-0; లివింగ్‌స్టోన్ 1-0-12-0.