75 వసంతాల సంబరo

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సముపార్జన కోసం తమ ప్రాణాలను పణంగాపెట్టి అమరులైన త్యాగధనులందినీ ఆయన స్మరించుకున్నారు. ఆంగ్లేయుల వలసపాలన నుంచి 1947, ఆగస్టు15న భారతావని విముక్తి పొందిందన్నారు. భారత దేశాన్ని వలసపాలకుల నుంచి విముక్తి కలిగించిన స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. వారి త్యాగాల ఫలితంగా మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు. ఏడున్నర దశాబ్దాల నుంచి భారత్ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదని అన్నారు. పేదరిక నిర్మూలనతో పాటు అందరికీ ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడు భారత్ ఇతరదేశాలకు మార్గదర్శిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని అన్నారు. ఏడేండ్లలో డెబ్భై ఏండ్ల అభివృద్ధిని సాధించుకున్నామని అన్నారు. అన్నిరంగాల్లో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. యువతకు ఉపాధి కల్పన అవకాశాలను కల్పించడంతో పాటు బడుగు, బలహీన వర్గాల స్వావలంబన, సాధికారత కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికే స్ఫూర్తి గా నిలుస్తున్నాయని నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *