భూ రికార్డుల మాయాజాలం

విచారణ లేకుండానే ఒకరి భూమి మరొకరి పేరు మీద మార్పు చేసిన రెవెన్యూ అధికారులు

రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చెయ్యాలి – బాధిత మహిళ విజయలక్ష్మి

 ములుగు,అక్షిత ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ధరిణి వెబ్ సైట్ పై రైతులు ఆందోళన చెందుతున్నారు.అన్ని పత్రాలు సరిగా ఉంటే స్లాట్ బుకింగ్ ఆధారంగా అధికారులు పట్టాలు మంజూరు చేస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా కొందరు అక్రమార్కులు దొంగ పత్రాలు సృష్టించి పట్టాలు చేపించుకున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.అలాగే రెవెన్యూ భూముల విషయంలో ఎలాంటి విచారణ లేకుండా రైతు ఇచ్చిన ఆధారాల ప్రకారం పట్టాలు మంజూరు చేయడంతో రైతులు అయోమయంలో పడిపోయారు.ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చిన అనంతరం అధికారాలు తహసీల్దార్ చేతుల్లోకి రావడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పూర్తి ఆధారాలు ఉంటే సరిపోతుందని అధికారులు చెబుతుండగా,కానీ విచారణ లేకుండా పట్టాలు జారీ చేస్తూపోతే తమ భూములకు రక్షణ లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు.ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని కొంత మంది ఇష్టారాజ్యంగా పట్టాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మార్చడానికి వీలు లేదని చెబుతున్నారు.రెవెన్యూ అధికారులు నిభందనల విషయంలో నిక్కచ్చిగా ఉంటమంటునే,ఇదే సమయంలో తమకు అనువైన వారి విషయంలో మాత్రం ఎలాంటి అడ్డు చెప్పకుండా పని చేస్తున్నారనే ఆరోప ణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే జిల్లాలోని ములుగు మండలంలోని దేవగిరిపట్నం కి చెందిన సానికొమ్ము విజయలక్ష్మి భర్త శ్రీనివాస్ రెడ్డి గత ఏడాది నవంబర్ 11 వ తేదీన మృతి చెందారు.భర్త చనిపోయిన ఆమె పుట్టెడు దుఃఖంలో ఉండగానే,ఆమెకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు,ఆమె భర్త సోదరుడు వెంకటప్పారెడ్డి పేరుమీద మా భూమి 7:39 గుంటలు పట్టా చేశారు.ఈ విషయంలో కలెక్టరు వినతిపత్రం ఇవ్వడంతోపాటు , ఆర్డీఓ,తహసీల్దార్కు సమాచారం అందించారు.అఫిడవిట్లో ఆమె భర్త దగ్గర ఉండడం లేదని పేర్కొన్నారు అని,కానీ , ఆయన మృతిచెందే రోజు వరకు ఆయన తోనే ఉన్నాను అని ఆమె అన్నారు.అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారనీ,కనీస సమాచారం ఇవ్వకుండా ఎవరు ఎలాంటి దొంగ పత్రాలు సృష్టించి ఇచ్చిన వారి పేరు మీద చేస్తే ఎలా అని ఆమె విమర్శించారు.తన భర్త సోదరులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యి,కాసుల కక్కుర్తితో తనకు చెందాల్సిన భూమిని వారి పేరు మీద పట్టా పాస్బుక్ చేశారని అన్నారు.అన్ని ఆధారాలు సమర్పించిన కూడా లీగల్ గా చూస్కోండి అంటున్నారే తప్ప తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు.ఇప్పటికైనా కలెక్టర్ గారు తగు విచారణ చేయించి నా భూమి నాకు చెందెట్లు చేయాలని,అక్రమ పత్రాలు సృష్టించిన వారిపై,వారికి సహకరించిన ములుగు మండల రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *