నిజాంపేట ప్రగతికి కృషి

డివిజన్ అభివృద్ధికి సహకరించండి
ఎమ్మెల్యేను కోరిన కార్పొరేటర్
నిజాంపేట్, అక్షిత ప్రతినిధిి : డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకరించాలని కార్పొరేటర్ కొలను వీరేందర్ రెడ్డి కోరారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 18వ డివిజన్ శ్రీ హోమ్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు స్థానిక కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి పలు సమస్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పక శ్రీ హోమ్స్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి కాలనీ సమస్యలను తెలిపి వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *