ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గ ఎం.ఎల్.సి ఎన్నిక నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి

రిటర్నింగ్ అధికారి,నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

*డి.ఐ. జి.,ఎస్.పి.ఏ.వి.రంగనాథ్ తో కలిసి ఎం.పి.డి.ఓ.లు,తహశీల్దార్ లు,పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

వరoగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల నియోజక వర్గ ఎం.ఎల్.సి ఎన్నిక సమన్వయంతో ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి,నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి డి.ఐ. జి.,ఎస్.పి.ఏ.వి.రంగనాథ్ తో కలిసి నల్గొండ జిల్లా లోని ఎం.పి.డి.ఓ.లు,తహశీల్దార్ లు,పోలీస్ అధికారులతో ఎన్నిక ఏర్పాట్లు పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం లో ఎం.సి.సి టీమ్ లు తహశీల్దార్ ఆధ్వర్యం లో మోడల్ కోడ్ పకడ్బందీ గా అమలు చేయాలని,మోడల్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఐ. పి.సి.,ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని అన్నారు.తహశీల్దార్ లు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలు తనిఖీ చేయాలని అన్నారు.మార్క్ డ్ ఓటర్ జాబితా మూడు కాఫీ లు,పోలింగ్ పార్టీలు పోలింగ్ ముందు రోజు మధ్యాహ్నం మార్చి 13 న పోలింగ్ స్టేషన్ కు చేరుకోవాలని అన్నారు.బ్యాలెట్ సైజ్ పెద్దగా ఉన్నందున బ్యాలెట్ పేపర్ పోలింగ్ రోజున మార్క్ చేయుటకు పెద్ద టేబుల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మార్చి 9 లోపల ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ పంపిణీ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. చనిపోయిన,డూప్లికేట్,నివాసం లేని ఓటర్ జాబితా సిద్ధం గా ఉంచుకోవాలని అన్నారు.వల్నరేబిలిటీ మ్యాపింగ్ పూర్తి చేసి పంపించాలని కోరారు. ఎం.పి.డి.ఓ.లు సెక్టోరల్ అధికారులు గా వ్యవహరిస్తారని,రూట్ వారీగా పోలింగ్ స్టేషన్ లకు రూట్ అధికారులతో పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయాలని అన్నారు.22 రూట్ లకు 22 రూట్ అధికారులు ఉన్నారని,ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ పంపిణీ పరిశీలించాలని ఎం.పి.డి.ఓ.లను కోరారు.తహశీల్దార్ లు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాలకు నంబరింగ్ వేయాలని అన్నారు పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, ఫ్యాన్స్,పారిశుధ్య చర్యలు తహశీల్దార్ లు పరిశీలించి తగు కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు.టాయిలెట్ లు వర్కింగ్ కండిషన్ లో ఉండాలని అన్నారు. డి.ఐ. జి.,ఎస్.పి. రంగనాథ్ మాట్లాడుతూ మార్చి 14 న పోలింగ్ ప్రశాంతంగా నిర్వహణకు శాంతిభద్రతలు నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రచారం,ర్యాలీ లలో డి.జె.వాడితే బైండోవర్ చేయాలని అన్నారు.రౌడీ షీటర్ లు,ట్రబుల్ మాంగర్ లను బైండోవర్ చేయాలని అన్నారు.పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్స్ లను బందోబస్తు తో ఆర్మ్ డ్ భద్రతారక్షణతో నల్గొండ జిల్లా రిసెప్షన్ కు తరలించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ ప్రతిమా సింగ్,ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *