ఉద్యోగాల కల్పనలో… బీజేపి విఫలం

బీజేపీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదు 

బడుగుల లింగయ్య యాదవ్

నార్కట్ పల్లి, అక్షిత ప్రతినిధి :ఏడాదికి యువతకు రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసి మాట తప్పి రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. నల్లగొండ- వరంగల్ -ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నార్కెట్ పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని అధికారులను,సిబ్బందిని, పట్టభద్రులను కలిసి టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్ధించారు. ఆరేండ్లలో లక్షా32వేల899 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క టీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తన పదవీ కాలంలో పట్టభద్రుల అనేక సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కారం చూపారని వివరించారు. ప్రచారంలో ఎంపీ బడుగు లతో పాటు ఎంపీపీ నరేందర్ రెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి , మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు సత్తిరెడ్డి, దోసపాటి విష్ణు, నడింపల్లి నాగరాజు , గుంజ రవి, ప్రసాద్ మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *