తొలి ప్రాధాన్యం ఓటు పల్లాకే…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో సిద్దార్ధ
మాడుగులపల్లి, అక్షిత న్యూస్ :నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తొలి ప్రాధాన్యం ఓటును టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి నమోదు చేయాలని గ్రాడ్యుయేట్లను మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు తనయుడు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ అభ్యర్ధించారు. మాడ్గులపల్లి మండలంలోని తోపుచర్ల, ఇస్కబాయి గూడెం, బొమ్మకల్ గ్రామాల్లో ఆయన పర్యటించి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల14న జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మరోసారి పల్లా కే పట్టం కట్టాలని అభ్యర్ధించారు. అనంతరం బొమ్మకల్లు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు జేరిపోతుల రాములు గౌడ్,పాలుట్ల బాబయ్య, మోసిన్ అలీ, సర్పంచ్ మారుతీ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, అంజిరెడ్డి, షోయబ్,మౌలాలీ, దర్శనపు రాం బాబు తదితరులు పాల్గొన్నారు.