కూన శ్రీశైలంకు అభినందనల వెల్లువ

కూన శ్రీశైలం గౌడ్ ను అభినందనలు తెలిపిన యాదాద్రి జిల్లా నాయకులు

కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి :

నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ను యాదాద్రి జిల్లా భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ తుమ్మల మురళీధర్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాష్టంలో తెరాస ను ఎదుర్కొనే బలమైన పార్టీ బీజేపీ యే అని ఆయాన అన్నారు. రాష్టంలో తెరాస పార్టీ అరాచకాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారనిదానికి గతంలో జరిగిన జి హెచ్ ఎం సి ఎన్నికలే నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ తుమ్మల శ్రీకాంత్ రెడ్డి ,
స్థానిక రెడ్డి సంగం అధ్యక్షులు గడ్డం రాజశేఖర్ రెడ్డిి,
,కె.తిరుమల రెడ్డి ,గంగుల రాజిరెడ్డి,పర్వతాలు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *