రాములు నాయక్ కు… బంజారాల సపోర్ట్

రాములు నాయక్ కు సంపూర్ణ మద్దతు : బంజారా సంఘాల నిర్ణయం

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
వచ్చేనెల 14న జరుగనున్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాములు నాయక్ కు బంజారా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించాయి. శనివారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ గిరిజన జాతి సమస్యలు, గిరిజనులకు దక్కాల్సిన 10శాతం రిజర్వేషన్ విషయమై శాసనమండలిలో గళం వినిపించే సత్తా రాములు నాయక్ కు ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోని బంజారా నాయకులు రాములు నాయక్ గెలుపు కోసం కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే రాములు నాయక్ గెలుపు సబ్బండ వర్ణాల గెలుపుగా భావించాలని, అన్ని కులాలు, అన్ని కులాలలోని అన్ని మతాలు, కూడా రాములు నాయక్ కి మద్దతు ప్రకటించాలని కోరారు. మద్దతు తెలిపిన వాటిలో బంజారా ఉద్యోగుల సంఘం, అఖిలభారత బంజారా సంఘం, లంబాడీల ఐక్య వేదిక, ఎల్ హెచ్ పి ఎస్, బంజారా భేరి, గిరిజన జాగృతి, లంబాడి విద్యార్థి వేదిక, లంబాడి సేనా, గిరి జనసేన, మహిళా విద్యార్థి మహిళా సంఘాలు, సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, మానియా నాయక్, నందకుమార్ నాయక్, ఇస్లావత్ సైదా నాయక్, లావూరి సైదా నాయక్, నారాయణమ్మ, హాసలి బాయి, సిద్దు నాయక్, సిపాయి నాయక్ ,నాగు నాయక్, శంకర్ నాయక్, హనుమంతు నాయక్, సురేష్ నాయక్, బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *