ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయం
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్, అక్షిత ప్రతినిధి :
ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా నల్గొండ లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీగా తెరాస శ్రేణులు బయలు దేరారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు.ప్రజలంతా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీ కీ మద్దతు పలుకుతున్నారని తెలిపారు.ఏ ఎన్నికలైనా టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని, ఎంతమంది ఎన్ని మాయమాటలు చెప్పినా, తెలంగాణా ప్రజలంతా
సీఎం కేసీఆర్ కెసిఆర్ వైపే ఉంటారని అన్నారు.పనిచేసే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి పట్టభద్రులు అంతా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కడెం వెంకట్ రెడ్డి, జిల్లా డీసీసీబీ మెంబర్ రంగాచారి, ఎంపీపీ గూడెపు శ్రీను, గ్రంధాలయ చైర్మన్ సంపత్ వర్మ, టిఆర్ఎస్ శ్రేణులు, పట్టభద్రులు,తదితరులు పాల్గోన్నారు.